logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

హీరోకి మరీ ఇంత పిచ్చా.. పాగల్ టీజర్ విడుదల!

‘వెళ్ళిపోమాకే’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన విశ్వక్ సేన్ ఆ తర్వాత ‘ఈ నగరానికి ఏమైంది’, ‘ఫలక్నుమా దాస్’ సినిమాలతో భారీక్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. తాజాగా మాస్ కా దాస్ నటిస్తున్న సినిమా ‘పాగల్’. దిల్ రాజు సమర్పణలో వస్తున్న పాగల్ సినిమా టీజర్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది.

టైటిల్ కు తగ్గట్టు విశ్వక్ సేన్ ఈ సినిమాలో ప్రేమ పిచ్చి పట్టిన యువకుడిగా కనిపిస్తున్నాడు. తన లవర్ సంతోషంగా ఉండటానికి తనను తానె కష్టపెట్టుకోవడానికి వెనకాడటం లేదు. ప్రేమించిన అమ్మాయి ముఖంలో సంతోషం చూడటానికి తనను ఇంకా వైల్డ్ గా కొట్టాలని రౌడీలను రెచ్చగొడతాడు. ఈ టీజర్ చూసిన వారంతా హీరోకి మరీ ఇంత పిచ్చా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

పాగల్ లో విశ్వక్ సేన్ లవర్ బాయ్ గా హ్యాండ్సమ్ లుక్ లో కనిపిస్తున్నాడు. మరో పాత్రలో హీరోయిన్ గా సిమ్రన్ చౌదరి కనిపిస్తుంది. నరేశ్‌ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. రధాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

Related News