logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

యూట్యూబ్ ఛానెల్ నిర్వాకంపై విశ్వక్సేన్ ఫైర్.. 24 గంటల టైమ్ ఇచ్చిన హీరో!

యూట్యూబ్ లో వ్యూస్ కోసం సెలబ్రిటీలను కించపరిచే విధంగా థంబ్ నెయిల్స్ క్రియేట్ చేస్తుంటారు కొందరు. వాటిని కొంత మంది లైట్ తీసుకుంటారు. కానీ ఓ యూట్యూబ్ ఛానెల్ నిర్వాకంపై హీరో విశ్వక్సేన్ ఫైర్ అయ్యాడు. అంతేకాదు వారు చేసిన తప్పుకు తనకు సారి చెప్పాలంటూ 24 గంటల టైమ్ ఇచ్చాడు. అందుకు సంబందించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది.

వివరాల్లోకి వెళితే ‘అక్షర’ సినిమాలోని పాటల లాంచ్ కార్యక్రమంలో విశ్వక్సేన్ ముఖ్య అతిధిగా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఈ సినిమా హీరోయిన్ నందిత శ్వేతా మాట్లాడుతూ.. విశ్వక్సేన్ ఈ కార్యక్రమానికి రావడం వాళ్ళ తన సినిమాకు హైప్ వచ్చిందని అన్నారు. అందుకు థాంక్స్ చెప్పారు. అయితే నందిత శ్వేతా మాట్లాడిన ఈ మాటలను ఓ యూట్యూబ్ ఛానెల్ వక్రీకరించింది. ‘విశ్వక్‌.. నీకు ఏం కావాలన్నా సిగ్గులేకుండా అడుగు ఇచ్చేస్తా’ అంటూ డబుల్ మీనింగ్ వచ్చేలా థంబ్ నెయిల్ పెట్టింది.

ఈ వీడియో విశ్వక్సేన్ కంట పడటంతో దీనిపై ఓ వీడియోను పోస్ట్ చేసాడు. మీ ఇంట్లో ఆడవాళ్ళూ లేరా? వాళ్ళ గురించి కూడా ఇలాగే మాట్లాడితే ఎలా అంటుంది. కొంచెం కూడా సిగ్గు లేని బతుకులు మీవి. రాసిన వాడు ఎవడో కానీ వాడికి 24 గంటల టైం ఇస్తున్న నాకు సారి చెప్తూ వీడియో పెట్టాలి లేదంటే ఎక్కడున్నా అడ్రస్ కనుక్కుని మరీ వాడితో సారి చెప్పిస్తా నాకు షూటింగ్ ఉన్నా పర్వాలేదు అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది.

Related News