logo

  BREAKING NEWS

ఓటీటీలో రిలీజైన కేజీఎఫ్: చాప్ట‌ర్‌-2..! కానీ షాకిచ్చిన అమెజాన్ ప్రైమ్‌  |   టాయిలెట్‌లో కెమెరా.. హోంమంత్రికి ఫిర్యాదు  |   కాబోయే భ‌ర్త మృతి.. ఆ యువ‌తి చేసిన ప‌నికి క‌న్నీళ్లు ఆగ‌వు  |   స‌లార్ సినిమాపై కిక్కిచ్చే వార్త‌  |   మ‌హేష్ – రాజ‌మౌళి సినిమాపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన విజ‌యేంద్ర ప్ర‌సాద్‌  |   వంద‌ల ఎక‌రాల భూమి ఉన్న కుటుంబంలో కేసీఆర్ పుట్టారు  |   2022 – 23కు కేంద్రీయ విద్యాల‌య అడ్మిష‌న్లు ప్రారంభం.. పూర్తి వివ‌రాలు  |   నిరుద్యోగుల‌కు భారీ శుభ‌వార్త‌.. రైల్వేలో 2,65,547 ఖాళీలు  |   మ‌రో కొత్త ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్న జ‌గ‌న్‌.. దేశంలోనే మొద‌టిసారి  |   అండ‌మాన్ ఎన్నిక‌ల్లో మ‌రోసారి స‌త్తా చాటేందుకు చంద్ర‌బాబు స్కెచ్‌  |  

కరోనా బాధితులకు ప్రాణం పోస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్

కరోనా బాధితులను కాపాడటంలో మెడికల్ ఆక్సిజన్ అనేది ఎంతో కీలకంగా మారిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశంలో కరోనా ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి 100 మందిలో 30 మందికి కరోనా పాజిటివ్ గా తేలుతుంది. దీంతో ఎక్కువ శాతం మందికి ఆక్సిజన్ అవసరం ఏర్పడుతుంది. మొదటి దశలో దీని అవసరం అంతగా కనిపించకపోయినా రెండో దశలో ఆక్సిజన్ వినియోగం భారీగా పెరిగిపోయింది. దీనినే మెడికల్ ఆక్సిజన్ గా పిలుస్తారు.

నష్టాల కారణంగా కేంద్రం ప్రైవేటు పరం చేయాలని చూస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ఇప్పుడు కరోనా బాధితుల పట్ల ప్రాణవాయువుగా మారింది. మన దేశంలోని వివిధ రాష్టాలకు ఆక్సిజన్ సరఫరా చేస్తున్న పారిశ్రామిక కర్మాగారాలలలో విశాఖ ఉక్కు కీలకంగా వ్యవహరిస్తోంది. ఇంతకీ మెడికల్ ఆక్సిజన్ కు ఉక్కు కర్మాగారాలకు సంబంధం ఏమిటి అంటే…

ఇనుము, ఉక్కును తయారు చేసే కర్మాగారాలలో ఆక్సిజన్ వినియోగం అధికంగా ఉంటుంది. అందుకోసం వీటిలో ప్రత్యేకించి ఆక్సిజన్ యూనిట్లను నెలకొల్పుతారు. దీనిని రోలింగ్ మిల్స్, ఫర్నేస్, స్టీల్‌ను వివిధ ఆకారాల్లో కట్ చేయడానికి, ఎస్ఎంఎస్ ప్లాంట్, లేజర్ సెట్టింగ్ లాంటి వాటికి, అలాగే వివిధ ప్రాసెసింగ్ వ్యవస్థల దగ్గర ఇగ్నిషియన్ కోసం ఇలా అనేక రకాలుగా అవతారు. పరిశ్రమల అవసరాల కోసం తయారు చేసే ఈ ఆక్సిజన్ ను ఇండస్ట్రియల్ ఆక్సిజన్ అంటారు.

సాధారణంగా మన పీల్చే గాలిలో ఆక్సిజన్ 20.95 శాతం, నెట్రోజన్ 78 శాతం, చాలా తక్కువగా ఆర్గాన్.. నియాన్.. కార్బన్ డైయాక్సైడ్.. హీలియం.. హైడ్రోజన్ వాయువులు ఉంటాయి. ఈ నిష్పత్తిలో ఏమాత్రం తేడా వచ్చిన అది మనుషుల ఆరోగ్యం పై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. పరిశ్రమల్లో తయారయ్యే వాటిలో 95 నుంచి 99 వరకు నాణ్యమైన ఆక్సిజన్ ఉంటుంది. ఇది లిక్విడ్ రూపంలో ఉంటుంది. అయితే ఇందులో ఉన్న కొన్ని మలినాలను తొలగించి దానిని వైద్యపరమైన చికిత్సా అవసరాల కోసం వినియోగిస్తారు.

దీనినే మెడికల్ ఆక్సిజన్ అంటారు. శ్వాస సంబంధ సమస్యలతో బాధపడేవారికి దీనిని వాయువు రూపంలోకి మార్చి అందిస్తారు. ప్రస్తుతం కోవిడ్ తో పోరాడుతున్న రాష్ట్రాలు తీవ్రమైన ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటున్నాయి. దీంతో పెద్ద ఎత్తున మెడికల్ ఆక్సిజన్ ను ఉత్పత్తి చేయాలని కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఆదేశించింది. ఈ మేరకు కేవలం 4 రోజుల వ్యవధిలో 500 టన్నుల ఆక్సిజన్ ను ఏపీ, తెలంగాణతో పాటుగా ఒడిశా, మహారాష్ట్రాలకు సరఫరా చేసింది. రానున్న రోజుల్లో ఉత్పత్తిని మరింత పెంచనుంది.

Related News