logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

అందమే ప్రాణం తీసింది.. విశాఖ మర్డర్ మిస్టరీని చేధించిన పోలీసులు

రెండు రోజుల క్రితం విశాఖ లో సంచలనం సృష్టించిన యువతి మర్డర్ మిస్టరీ వీడింది. మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహంపై గాయాలు ఉండటంతో హత్యగా గుర్తించారు. ఈ కేసుకు సంబందించిన మొత్తం నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరొక నిందితుడి కోసం గాలిస్తున్నారు. నిందితులను విచారించగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

అక్కయ్యపాలెం సమీపంలోని నందగిరి నగర్‌లో ప్రాంతంలో గురువారం మృతి చెందిన యువతి దివ్య(22) వసంత మరో మహిళలతో కలిసి చట్ట వ్యతిరేక కలాపాల ద్వారా అడ్డదారిలో డబ్బు సంపాదించేవారు. ఇటీవల ఈ డబ్బు పంచుకునే విషయంలో వీరి మధ్య వివాదం తలెత్తింది. తాను అందంగా ఉన్నానని తనకు ఎక్కువ వాటాను పంచాలని దివ్య నిలదీయడంతో మిగిలిన ఇద్దరు మహిళలు దివ్యపై పగ పెంచుకున్నారు.

మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి దివ్యను ఓ గదిలో బంధించారు. దివ్యకు గుండు కొట్టించి, కను బొమ్మలు కత్తిరించి అందవిహీనంగా చేసారు. ఆమె శరీరంపై వాతలు పెట్టి చిత్రహింసలకు గురి చేసారు. చివరకు మూడు రోజులపాటు భోజనం పెట్టకుండా చంపినట్టుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. దివ్యను హత్య చేయడానికి ఉపయోగించిన సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలిసింది. దివ్య ఇంటి చుట్టుపక్కల వారిని, కుటుంబ సభ్యులను విచారించి మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు.

Related News