logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

సాయి పల్లవి ఆ పాత్రలో నటించడం లేదు: దర్శకుడి వివరణ

రానా దగ్గుబాటి- సాయి పల్లవి ప్రధాన పాత్రధారులుగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినినిమా ‘విరాటపర్వం’. 1990లో జరిగిన నక్సలైటు ఉద్యమాన్ని ఆధారం చేసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి సాయి పల్లవి ఫస్ట్ లుక్ ను విడుదల చేయగా వైరల్ గా మారింది. ఆనాటి నుండిసాయి పల్లవి పాత్రపై అనేక రూమర్లు వినిపిస్తున్నాయి.

తాజాగా తెలంగాణకు చెందిన విప్లవ గాయని బెల్లి లలిత పాత్రలో సాయి పల్లవి నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఈ ప్రచారం మరీ ఎక్కువ కావడంతో సినిమా దర్శకుడు వేణు ఉడుగుల దీనిపై స్పందించారు. విరాట పర్వంలో సాయి పల్లవి పాత్రపై జరుగుతున్న ప్రచారం నిజం కాదని స్పష్టం చేసారు. ఈ సినిమాలో ఆమె ఒక ప్రత్యేక పాత్రలో కనిపిస్తుందని, అది సినిమాకు చాలా కీలకమైన ఘట్టమని పేర్కొన్నారు.

డి. సురేష్‌బాబు, సుధాక‌ర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో జాతీయ అవార్డు విన్నర్ ప్రియమణి, బాలీవుడ్ ఫేమ‌స్ న‌టి నందితా దాస్‌, ఈశ్వ‌రీరావు, జ‌రీనా వ‌హాబ్ ప్ర‌ధాన పాత్ర‌లు చేస్తున్నారు. హాలీవుడ్‌కు చెందిన డానీ సాంచెజ్‌-లోపెజ్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఈ వేస‌విలో ‘విరాట‌ప‌ర్వం’ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వ‌చ్చేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి

Related News