logo

  BREAKING NEWS

ప‌వ‌న్ క‌ళ్యాణ్ – రామ్‌చ‌ర‌ణ్‌తో ఇండియా టాప్ డైరెక్ట‌ర్ సినిమా..?  |   ‘గుంటూరు’కు చెందిన కోహినూర్ వజ్రం బ్రిటన్ చేతికి ఎలా వెళ్ళింది?  |   బ్రేకింగ్: పంతం నెగ్గించుకున్న నిమ్మ‌గ‌డ్డ‌.. జ‌గ‌న్‌కు భారీ షాక్‌  |   వ్యాక్సిన్ అంద‌రూ తీసుకోవాలా ? క‌రోనా వ‌చ్చి త‌గ్గిన వారూ తీసుకోవాలా ?  |   గుర‌క పెడుతున్నారా..? ఈ చిట్కా పాటిస్తే జీవితంలో గుర‌క పెట్ట‌రు  |   వ‌కీల్ సాబ్ మ‌రో రికార్డు.. షూటింగ్ కాక‌ముందే రూ.15 కోట్లు వ‌చ్చేశాయి  |   తెలంగాణ కొత్త‌గా ఆరు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడెక్క‌‌డో తెలుసా ?  |   ‘మా సినిమా డైలాగులే కాపీ కొడతారా?’.. దేవినేనికి కొడాలినాని కౌంటర్  |   ముఖ్య‌మంత్రి మార్పు ఉండొచ్చు.. ఈటెల సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు  |   భూమా అఖిలప్రియ అరెస్టుపై కొడాలినాని సంచలన వ్యాఖ్యలు!  |  

ప్రధాని మోదీకి షాకిచ్చిన టీమిండియా కెప్టెన్!

టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డు సృష్టించాడు. కోహ్లీకి ఈ తరహా రికార్డులు కొత్తేమీ కాకపోయిన ఈసారి మరో విశేషం కూడా ఉంది. కోహ్లీ ఏకంగా భారత ప్రధాని నరేంద్ర మోదీని ధాటి గుర్తింపు తెచ్చుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో అత్యంత ప్రజాదరణ పొందుతున్న యాప్ ఏదైనా ఉందా అంటే అది ఇంస్టాగ్రామ్.

అత్యాధునిక ఫీచర్లతో రోజురోజుకి తన యూజర్ల సంఖ్యను పెంచుకుంటూ వెళుతుంది ఈ యాప్. అయితే ఇంస్టాగ్రామ్ యాప్ నిర్వహించిన అత్యంత ప్రభావశీలుర వ్యక్తుల జాబితాలో కోహ్లీ మోదీని ధాటి దూసుకెళ్లాడు. హైప్ ఆడిటర్ విడుదల చేసిన జాబితాలో కోహ్లీ 12వ స్థానంలో భారత్ తరపున మొదటి స్థానంలో నిలిచాడు.

ఆ తర్వాతి స్థానాల్లో కోహ్లీ భార్య అనుష్క శర్మ 26 స్థానంలో నిలిచారు. కోహ్లీ తరువాతి స్థానంలో మోదీ, అనుష్క, దీపికా పడుకునే ఉన్నారు. అలాగే ఈ ఏడాది అత్యధికంగా ప్రస్తావించిన భారత అథ్లెట్ గా పురుషుల విభాగంలో ధోని, రోహిత్ శర్మలను కోహ్లీ వెనక్కి నెట్టి మొదటి స్థానాల్లో నిలిచాడు.

ట్విట్టర్ లో ఎక్కువగా ట్వీట్లు చేసిన వారిలో బాడ్మింటన్ స్టార్ సింధు, సైనా నెహ్వాల్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. గత ఆగస్టులో తాను తండ్రి కాబోతున్నానంటూ కోహ్లీ ట్విట్టర్ వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ట్వీట్ అత్యధిక లైకులు సాధించిన జాబితాలో చోటు సంపాదించుకుంది.

Related News