logo

  BREAKING NEWS

దూసుకెళ్తున్న బంగారం ధరలు: 09.04. 2021 బంగారం, వెండి ధరలు  |   2021లో ఉగాది పండగ ఎప్పుడు? తేదీ ప్రకటించిన దేవాదాయశాఖ మంత్రి  |   భార‌తీయుల‌కు న్యూజిల్యాండ్‌లోకి నో ఎంట్రీ కార‌ణం ఇదే!  |   యూపీఐ ట్రాన్సాక్షన్ ఫెయిలైందా? రోజుకి రూ.100 పరిహారం పొందండి ఇలా..  |   టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసయ్యారా? ఇండియన్ ఎయిర్ ఫోర్స్ భారీ నోటిఫికేషన్, హైద్రాబాద్లో ఖాళీలు  |   వాతం నొప్పులు తగ్గించే అద్భుతమైన చిట్కా  |   పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన ధరలు: 08.04. 2021 బంగారం, వెండి ధరలు  |   40 దాటినా పెళ్లి చేసుకొని తారలు.. కారణం తెలిస్తే కళ్లు చెమరుస్తాయి  |   తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు.. ఎలా పొందాలి?  |   స్వల్పంగా పెరిగిన బంగారం: 07.04. 2021 బంగారం, వెండి ధరలు  |  

కోహ్లీ ట్వీట్ బెడిసికొట్టింది.. నెటిజన్ల కౌంటర్లు!

దీపావళి సందర్భంగా టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన ఓ ట్వీట్ పై ఇప్పుడు ఆయన ట్రోలింగ్ ను ఎదుర్కుంటున్నారు. నిన్న దీపావళి కావడంతో పర్యావరణం పై ఉన్న ప్రేమతో విరాట్ ఓ ట్వీట్ పోస్ట్ చేసాడు. ‘అందరికీ దీపావళి శుభాకాంక్షలు.. పర్యావరణాన్ని కాపాడేందుకు ఈసారి పండుగకు ఎవ్వరు క్రాకర్స్ ను కాల్చకండి’ అంటూ తెలిపాడు.

అంతే ఈ ట్వీట్ చూసిన నెటిజన్లలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. విరాట్ ను ఆయన భార్య అనుష్క శర్మను కూడా కలిపి ట్రోలింగ్ కు దిగుతున్నారు. అయితే వారి కోపానికి కారణం లేకపోలేదు. ఇటీవల విరాట కోహ్లీ తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ వేడుకలు కోహ్లీ దుబాయిలో తన భార్య అనుష్క, బెంగుళూరు టీమ్ మేట్స్ తో కలిపి ఓ బోట్ లో ఘనంగా జరుపుకున్నాడు.

ఈ సందర్భంగా ఆర్సీబీ యాజమాన్యం కోహ్లీ కి శుభాకాంక్షలు తెలుపుతూ పెద్ద ఎత్తున టపాసులు కాల్చారు. వాటిని కోహ్లీ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఇంకేముంది. వాటిని ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. నీ పుట్టిన రోజు వేడుకల్లో కాల్చితే పర్యావరణం నష్టపోదు కానీ హిందువులు ఎంతో ఇష్టంగా కేజరుపుకునే పండగనాడు కాల్చొదంటావా.. మీ భార్య భర్తలు చెప్పిన నీతులు చాలు ఇక ఆపండి అంటూ ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే ఐపీఎల్లో ఓటమి పాలవడం పట్ల కోహ్లీ పలు విమాశ్రయాలు ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే.

Related News