logo

  BREAKING NEWS

తుమ్ములు ఎక్కువ‌గా వ‌స్తున్నాయా ? ఈ చిట్కా పాటిస్తే త‌గ్గిపోతాయి  |   జ‌గ‌న్‌ను ఓడించే కుట్ర‌..? కొడాలి నాని పాత్ర‌..?  |   బ్రేకింగ్‌: జ‌గ‌న్ ఇంటి ముట్ట‌డి.. హైద‌రాబాద్‌, తిరుప‌తిలో ఉద్రిక్త‌త‌‌  |   బ్రేకింగ్: డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో మ‌హేష్ బాబు స‌తీమ‌ణి న‌మ్ర‌త పేరు  |   అమెరికా నుంచి ఎలా వ‌చ్చింది..? ‘కాంగ్రెస్ గ‌డ్డి’ అని ఎందుకు పిలుస్తారు ?  |   తెలుగుదేశం పార్టీకి కొత్త అధ్య‌క్షుడి పేరు ఖ‌రారు  |   ఇక నుంచి ‘యాదాద్రి’ రైల్వే స్టేష‌న్‌  |   హ‌రీష్ రావు వ‌ర్సెస్ ర‌ఘునంద‌న్‌రావు  |   ఈ చిన్న ప‌ని చేస్తే 15 నిమిషాల్లో త‌ల‌నొప్పి మాయం  |   రూ.15,000 లోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు ఇవే  |  

‘ముగ్గురం కాబోతున్నాం’.. కోహ్లీ శుభవార్త!

టీమ్ ఇండియా క్రికెటర్లు వరుస పెట్టి శుభవార్తలు వినిపిస్తున్నారు. కొద్ది సేపటి క్రితమే కెప్టెన్ విరాట్ కోహ్లీ భారీ శుభవార్తను తమ అభిమానులతో పంచుకున్నాడు. తాను తండ్రి కాబోతున్న విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. తన సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ గర్భవతి అని తెలిపాడు. ‘జనవరి 2021లో మేం ముగ్గురం కాబోతున్నాం’ అనే కాప్షన్ ను జోడించాడు.

ప్రస్తుతం అనుష్కకు 5వ నెలగా తెలుస్తుంది. ఈ వార్తతో ట్విట్టర్ లో కోహ్లీ దంపతులకు అభిమానులు, సినీ, క్రికెట్ సెలబ్రిటీల నుంచి భారీగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఇప్పటికే అంబటి రాయుడికి కూతురు పుట్టింది. మరో క్రికెటర్ హార్దిక్ పాండ్యా కూడా ఇటీవలే తండ్రైన విషయం తెలిసిందే. తమ కెరీర్ పరంగా క్షణం తీరిక లేకుండా గడిపే వీరందరికీ కరోనా లాక్ డౌన్ కలిసొచ్చినట్టుగా తెలుస్తుంది.

దాదాపు 5 నెలల పాటు విరాట్, అనుష్కలు ఈ విరామాన్ని పూర్తిగా ఆస్వాదించారు. అదే సమయంలో కరోనా జాగ్రత్తలు పాటించడంలో అభిమానులు, ప్రజలకు అవగాహన కల్పించారు. కరోనాపై పోరాటానికి భారీగా విరాళాలు ప్రకటించి మంచి మనసు చాటుకున్నారు.

Related News