మహేష్ బాబు – రాజమౌళి సినిమాపైన రచయిత విజయేంద్ర ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్ వచ్చే సంవత్సరం ప్రథమార్థంలో ప్రారంభమవుతుందని ఆయన వెల్లడించారు. ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ సినిమాపై ఆసక్తికర విషయాలు చెప్పారు. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ ఇంకా పూర్తి కాలేదని, ప్రస్తుతం కథ రాస్తున్నట్లు తెలిపారు. అటవీ నేపథ్యంతో ఈ కథ సాగుతుందన్నారు.
దుర్గా ఆర్ట్స్ పతాకంపైన కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మించనున్న సంగతి తెలిసిందే. కాగా, ప్రస్తుతం మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా విడుదలకు సిద్ధమైంది. జూన్ నుంచి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో ఒక సినిమాలో మహేష్ నటించనున్నారు. ఈ సినిమా తర్వాత వచ్చే సంవత్సరంలో రాజమౌళితో సినిమా ప్రారంభమవుతుంది.