logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

విజయవాడ గ్యాంగ్ వార్.. ఆ వివాదమే ప్రాణం తీసింది..!

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన గ్యాంగ్ వార్ కేసు తో విజయవాడ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతూ వస్తుంది. తాజాగా ఈ కేసులో అసలు విషయాల్ని విజయవాడ పోలీసులు మీడియా ముందు వివరించారు. సీపీ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ.. విజయవాడలో ప్రదీప్ రెడీ శ్రీధర్ రెడ్డిల మధ్య నెలకొన్న భూ వివాదం కారణంగా ప్రదీప్ రెడ్డి నాగబాబు అనే వ్యక్తిని కలిసాడు. మే 28న జరిగిన ఈ మీఈటింగ్ కు సందీప్, పండు కూడా హాజరయ్యారు. నాగబాబు తర్వాత పెద్దవాడినైన తాను సెటిల్ మెంట్ చేస్తుంటే మధ్యలో నువ్వెందుకు వచ్చావని సందీప్ పండును నిలదీసాడు. ఈ సమయంలోనే వీరిద్దరి మధ్య మాటా మాటా పెరిగి వాగ్వాదం జరిగింది.

వమరుసటి రోజున పండు సందీప్ ఇంటికి వెళ్లి అతని తల్లితో గొడవ పడ్డాడు. ఆ తర్వాత సందీప్ నిర్వహిస్తున్న శివ బాలాజీ స్టీల్ షాపు వద్దకు వెళ్లి సందీప్ అనుచరులపైనా దాడి చేసాడు. ఆ విషయమై సందీప్ పండుకు ఫోన్ చేసి గొడవపడ్డాడు. ఫోన్ లోనే ఇద్దరు సవాళ్లు విసురుకున్నారు. మే 30వ తేదీ సాయంత్రం 4 గంటల సమయంలో పటమట తోట వారి వీధిలో పండు, సందీప్ గ్రూపులు కత్తులు, బ్లేడులతో భీభత్సం సృష్టించారు.

ఒకరిపై ఒకరు కత్తులు, రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సందీప్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. పండు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ గ్యాంగ్ లోప్రశాంత్ అనే డిగ్రీ విద్యార్ధి తప్ప కాలేజీ విద్యార్థులు లేరని పోలీసులు తెలిపారు. సందీప్ పై గతంలోనే రౌడీ షీట్ ఉండగా 2016 లో హై కోర్టు ఇచ్చిన తీర్పు వల్ల అది కొట్టివేశారన్నారు. పండుపై 3 కేసులు, సందీప్ పై 13 కేసులు నమోదై ఉన్నాయన్నారు. ఈ కేసులో మొత్తం 13 మందిని అదుపులోకి తీసుకున్నట్టుగా పోలీసులు వెల్లడించారు.

Related News