logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

మరో దారుణం.. ఇంజినీరింగ్ విద్యార్థినిపై ఘాతుకం

ప్రేమోన్మాది ఘాతుకానికి ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని బలైంది. బెజవాడలోని మాచర్లకు చెందిన దివ్య తేజస్విని అనే యువతిని తన నివాసంలో స్వామీ అనే యువకుడు కత్తితో గొంతుకోశాడు. కుటుంబసభ్యులు, స్థానికులు గమనించి యువతిని ఆసుపత్రికి తరలించేలోపే ఆమె పరిస్థితి విషమించి మరణించింది. తేజస్వినిపై దాడి చేసిన అనంతరం నిందితుడు అదే కత్తితో తనను తాను గాయపరుచుకున్నాడు.

ప్రస్తుతం నిందితుడు గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు సమాచారం. కాగా నగరంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో తేజసిని బీటెక్ చదువుతుంది. వీరిద్దరికి గతంలోనే పరిచయం ఉందా లేక తన ప్రేమను తిరస్కరించిందన్న కోపంతోనే నిందితుడు ఈ ఉన్మాదానికి పాల్పడ్డాడా అనే విషయం తెలియాల్సి ఉంది.

ఈరోజు 11 గంటల ప్రాంతంలో తేజస్విని ఇంటి వెనకవైపు గోడ దూకి ఆమె ఇంట్లోకి ప్రవేశించాడు. అనంతరం తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతుపై బలంగా కోశాడు. అంతా తేరుకుని ఆసుపత్రికి తరలించేలోపే తేజస్విని అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. కత్తి బలంగా మెడపై దిగడంతో ఆసుపత్రిలో ప్రాణాలు వదిలింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related News