logo

  BREAKING NEWS

ఢిల్లీ రైతుల ఆందోళనపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు!  |   రామనాయుడుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ సీఎం జగన్!  |   మైండ్‌బ్లాక్ అయ్యే రీతిలో ”వ‌కీల్ సాబ్” రెమ్యున‌రేష‌న్‌  |   ఎమ్మెల్యేకు క‌రోనా.. ఏపీ అసెంబ్లీలో కోవిడ్ క‌ల‌వ‌రం  |   అంద‌రికీ వ్యాక్సిన్ అవ‌స‌రం లేదు… వ్యాక్సిన్ వ‌చ్చినా మాస్కులు త‌ప్ప‌వు  |   ఏపీ అసెంబ్లీ: చంద్రబాబు స్పీకర్ మధ్య మాటల యుద్ధం!  |   ప్ర‌భాస్ – ప్ర‌శాంత్ నీల్ తీసేది రీమేక్ సినిమా.. ఇంత రిస్క్ ఎందుకు..?  |   ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం.. ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం!  |   పేద విద్యార్థులకు ఎల్ఐసీ స్కాల‌ర్‌షిప్‌లు.. పూర్తి వివ‌రాలు ఇవీ  |   బ్రేకింగ్: గ్రేటర్ లోని ఆ ప్రాంతంలో పోలింగ్ రద్దు: ఎన్నికల సంఘం  |  

అసదుద్దీన్ అద్భుతదీపంపైనే ఆశలన్నీ.. కేసీఆర్ పై విజయశాంతి సెటైర్లు

జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూలు విడుదలైన సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి కేసీఆర్ పై మరోసారి హాట్ కామెంట్లు చేసారు. సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు పెట్టిన విజయశాంతి దుబ్బాకలో టీఆర్ఎస్ పార్టీ ఓటమిపాలైన విషయాన్ని ప్రస్తావిస్తూ సెటైర్లు వేశారు. గ్రేటర్ ఎన్నికల్లో వంద శాతం ఓట్లతో గెలుస్తామంటూ కేసీఆర్ ఓటర్లను మభ్యపెట్టే పనిలో ఉన్నారన్నారు.

”దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా, టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ గారు దొరహంకార గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ ఓటమిని కప్పిపుచ్చుకునేందుకు జిహెచ్ఎంసి ఎన్నికల్లో వంద సీట్లకు పైగా గెలుస్తామని వాస్తవానికి దూరమైన ప్రకటనలు చేస్తూ.. ముఖ్యమంత్రి గారు ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అల్లావుద్దీన్ అద్భుతదీపం మాదిరిగా, అసదుద్దీన్ అద్భుతదీపంతో జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఏమైనా అద్భుతాలు జరుగుతాయని సీఎం దొరగారు ఆశలు పెంచుకున్నారని అర్థమవుతోంది.

చాలా ఏళ్ల పాటు గెలిచిన నియోజకవర్గాల్లో ఏమాత్రం అభివృద్ధి చేయకుండా… విద్వేష ప్రసంగాలతో మాయమాటలు చెప్పి పాతబస్తీ ఓటర్లను మోసం చేయడంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అందె వేసిన చేయిగా మారిపోయారు. ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండానే ఓటర్లను మాయ చేసి.. ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకునే ఫార్ముల గురించి కెసిఆర్ గారు ఎమ్ఐఎమ్ అధినేతతో మంతనాలు జరిపారన్న ప్రచారం జరుగుతోంది.

గత ఎన్నికల్లో కెసిఆర్ గారి హామీలపై భ్రమలు పెంచుకున్న గ్రేటర్ వోటర్లు ఈసారి మాత్రం టిఆర్ఎస్ అభ్యర్ధులకు తగిన గుణపాఠం నేర్పేందుకు సిద్ధమవుతున్నారు. ఎంఐఎం తో కలిసి జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఎన్ని జిమ్మిక్కులు చేయాలనుకున్న సీఎం దొరగారు వేసుకున్న లెక్కలన్నీ ఈసారి తారుమారు కాబోతున్నాయని ఈ మధ్య కాలంలో ఓటర్ల నాడిని చూస్తే అనిపిస్తోంది. ఏది ఏమైనా జిహెచ్ఎంసి మేయరు పదవి ఈ పర్యాయం “మేసేవారికి” కాక “మేయరు…” అనే వారికి దక్కాలని ప్రజలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారన్నది వాస్తవం.” అని విజయశాంతి సుదీర్ఘ పోస్టును రాసుకొచ్చారు.

Related News