logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

కేసీఆర్ దొరగారు ఆ విషయాన్ని ఇప్పటికైనా గ్రహించాలి: విజయశాంతి

సినీ నటి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ చైర్ పర్సన్ విజయశాంతి కేసీఆర్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలపై రోజురోజుకి నేరాలు పెరిగిపోతున్నాయి, వాటిని కట్టడి చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అసంతృప్తి వ్యక్తం చేసారు.

‘నా తెలంగాణలోని ఆడబిడ్డలపై కొందరు ఇంతటి హేయమైన నేరాలకు పాల్పడటం తల తీసుకోవాలనే ఆక్రోశాన్ని కల్పిస్తోంది. ఏడాది కిందట జరిగిన దిశ ఘటన చేసిన గాయాలు ఇంకా ఆరకముందే… నిజామాబాద్‌లో మరో యువతిపై కొంతమంది సామూహిక అత్యాచారానికి పాల్పడటం మనసును కలచివేస్తోంది. సాక్షాత్తూ జిల్లా పరిపాలనా యంత్రాంగం కొలువై ఉండే కలెక్టరేట్‌కు సమీపాన ఈ దారుణం జరిగింది…

గతంలో ఇటువంటి దారుణాలు జరిగినప్పుడు, మహిళా రక్షణకు అంత చేస్తాం… ఇంత చేస్తామంటూ తెలంగాణ పాలకులు చెప్పిన కబుర్ల నీటిమీద రాతలేనని స్పష్టమైంది. రాష్ట్రంలో ఇప్పటికే అమీన్‌పూర్ ఆశ్రమంలో అనాథ బాలిక మృతి ఘటన కలకలం రేపుతూనే ఉంది. ఎన్‌కౌంటర్లు సమర్థనీయం కానప్పటికీ, దిశ ఘటనలో నిందితులు తూటాలకు నేలకొరిగినా… పోలీసులంటే ఏ మాత్రం భయంలేని రీతిలో… మహిళా రక్షణ చట్టాలంటే ఏమాత్రం లెక్కలేనితనంతో కామాంధులు చెలరేగిపోతున్నారంటే… తెలంగాణలో ఆ చట్టాల అమలు ప్రభావం ఎంత గొప్పగా ఉందో అర్థమవుతూనే ఉంది.

తెలంగాణలోని ఈ పరిస్థితులు రాష్ట్రంలోని మహిళలందరినీ తీవ్ర అభద్రతా భావంలోకి నెడుతున్నాయనే వాస్తవాన్ని కేసీఆర్ దొరగారు ఇప్పటికైనా గ్రహించాలి.’ అని విజయశాంతి పేర్కొన్నారు.

Related News