logo

  BREAKING NEWS

8 గంట‌ల కంటే ఎక్కువ ప‌ని చేయ‌డం ఎంత డేంజ‌రో తెలుసా ?  |   53 మంది మహిళా ఖైదీలకు సీఎం జగన్ శుభవార్త!  |   బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల: గ్రేటర్ ప్రజలపై వరాల జల్లు!  |   ఎడ‌మ చేతివాటం ఎందుకు వ‌స్తుంది ? వారిలో తేడా ఏముంటుంది ?  |   ఏబీ వెంకటేశ్వర్ రావుకు సుప్రీంలో షాక్..!  |   జ‌గ‌న‌న్న తోడు.. పేద‌ల‌కు రూ.10 వేలు.. ఇలా పొందాలి  |   ‘దమ్ముంటే కూల్చరా’.. అక్బరుద్దీన్ కు బండి సంజయ్ సవాల్!  |   మేయర్ పీఠాన్ని దక్కించుకోగానే వారిని తరిమికొడతాం .. పాతబస్తీపై బండి సంచల వ్యాఖ్యలు  |   కరోనా సెకండ్ వేవ్: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!  |   మహిళల భద్రతకు ‘అభయం’ యాప్.. ఎలా పనిచేస్తుంది? ప్రత్యేకతలేమిటి?  |  

మళ్లీ పాత పార్టీలోకే విజ‌య‌శాంతి

సినీ న‌టి, కాంగ్రెస్ పార్టీ నాయ‌కురాలు విజ‌య‌శాంతి మ‌ళ్లీ పాత గూటికే చేర‌బోతున్నారు. ఈ మేర‌కు ఆమె కీల‌క చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక ముందే ఆమె ఒక నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. విజ‌య‌శాంతి పార్టీ మార‌బోతున్నార‌నే ప్ర‌చారం కాంగ్రెస్ పార్టీలో క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేస్తోంది. ప్ర‌స్తుతం విజ‌య‌శాంతి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ప్ర‌చార క‌మిటీ ఛైర్‌ప‌ర్స‌న్ హోదాలో ఉన్నారు.

సినీ జీవితానికి ఫుల్‌స్టాప్ పెట్టిన త‌ర్వాత విజ‌య‌శాంతి భార‌తీయ జ‌న‌తా పార్టీ నుంచి రాజ‌కీయ ఆరంగేట్రం చేశారు. కొంత‌కాలం పాటు ఆ పార్టీలో కీల‌క నాయ‌కురాలిగా ప‌ని చేశారు. త‌ర్వాత తెలంగాణ రాష్ట్ర సాధ‌నే ల‌క్ష్యంగా బీజేపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి త‌ల్లి తెలంగాణ పార్టీని స్థాపించి కొంత‌కాలం న‌డిపించారు. ఆ త‌ర్వాత ఒకే ల‌క్ష్యంతో ఉన్న తెలంగాణ రాష్ట్ర స‌మితిలో త‌న త‌ల్లి తెలంగాణ పార్టీని విలీనం చేశారు.

టీఆర్ఎస్‌లో చేరిన త‌ర్వాత విజ‌య‌శాంతి ఆ పార్టీలో కీల‌క నాయ‌కురాలిగా మారారు. ఒకానొక ద‌శ‌లో పార్టీలో నెంబ‌ర్ 2 స్థానంలో ఉన్న నాయ‌కురాలిగా గుర్తింపు పొందారు. 2009లో మెద‌క్ నుంచి టీఆర్ఎస్ త‌ర‌పున ఎంపీగా కూడా ఆమె విజ‌యం సాధించారు. తెలంగాణ కోసం ఆమె చాలానే క‌ష్ట‌ప‌డ్డారు. ఉద్య‌మంలో చురుగ్గా పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పాట‌య్యే ద‌శ‌లో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీలో చేరాల‌నే ఉద్దేశ్యంతో ఆమె టీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు.

కాంగ్రెస్‌లో ఆమెకు మొద‌ట్లో మంచి గుర్తింపే ల‌భించింది. 2014లో ఆమె మెద‌క్ అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. ఆ త‌ర్వాత చాలా కాలం పాటు సైలెంట్ అయిపోయారు. మ‌ళ్లీ 2018 ఎన్నిక‌ల ముందు యాక్టీవ్ అయ్యారు. విజ‌య‌శాంతికి కాంగ్రెస్ పార్టీ ప్ర‌చార బాధ్య‌త‌లు అప్ప‌గించి ప్రాధాన్య‌త క‌ల్పించారు సోనియా గాంధీ. 2018లో ఆమె పోటీ కూడా చేయ‌కుండా రాష్ట్ర‌మంతా ప‌ర్య‌టించి ప్ర‌చారం చేశారు. కానీ, ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది.

అప్ప‌టి నుంచి మ‌ళ్లీ ఆమె రాజ‌కీయంగా సైలెంట్ అయిపోయారు. తాజాగా దుబ్బాక ఉప ఎన్నిక‌కు సంబంధించి కూడా ఆమె ఎటువంటి బాధ్య‌త‌లు తీసుకోలేదు. నిజానికి ఆమె కాంగ్రెస్‌లోనే ఉన్నా మాన‌సికంగా పార్టీకి పూర్తిగా దూర‌మ‌య్యారు. పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌డం లేదు. ఆమె గాంధీ భ‌వ‌న్ వైపు రావ‌డం మానేసి చాలా రోజులైంది. దుబ్బాక‌లో రాష్ట్రంలోని అంద‌రు కాంగ్రెస్ నేత‌లు ప్ర‌చారం చేస్తున్నా ఆమె మాత్రం చేయ‌డం లేదు.

ఈ క్ర‌మంలో ఆమె బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి విజ‌య‌శాంతి ఇంటికి వెళ్లి అర‌గంట పాటు చ‌ర్చ‌లు జ‌రిపారు. ఆమెను పార్టీలోకి ఆహ్వానించిన‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్ప‌టికే కాంగ్రెస్ ప‌ట్ల అసంతృప్తితో ఉన్న విజ‌య‌శాంతి త్వ‌ర‌లోనే బీజేపీలో చేర‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది. ఇంకా ఆమె అధికారికంగా ఏ ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.

Related News