logo

  BREAKING NEWS

పీఆర్సీ నివేదిక లీక్: తెలంగాణ సర్కార్ సీరియస్..నిరాశలో ఉద్యోగులు!  |   బ్రేకింగ్: మళ్ళీ రాజకీయాల్లోకి మెగాస్టార్.. నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు!  |   ఎర్రకోట అల్లర్లు: పంజాబీ నటుడు దీప్ సిద్ధూ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!  |   అంబానీ సెకను ఆదాయం.. సామాన్యుడికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలుసా?  |   ప‌ద్మ‌విభూష‌ణ్‌, ప‌ద్మ‌భూష‌ణ్‌, ప‌ద్మ‌శ్రీ అవార్డుల‌తో ఎంత డ‌బ్బు ఇస్తారో తెలుసా ?  |   హింసాత్మకంగా మారిన రైతుల ట్రాక్టర్ ర్యాలీ  |   ఏపీ పంచాయతీ వార్: జగన్ సర్కార్ ఆదేశాలకు ఎస్ఈసీ నో..!  |   తెలంగాణలో కొత్త పార్టీ.. క్లారిటీ ఇచ్చిన వైఎస్ షర్మిల!  |   సుప్రీం తీర్పు: అధికారులతో సీఎం జగన్ అత్యవసర సమావేశం!  |   పంచాయతీ ఎన్నికలు.. ఉద్యోగ సంఘాలకు నిమ్మగడ్డ షాక్!  |  

హీటెక్కిన ఏపీ పాలిటిక్స్: నారా లోకేష్ సవాల్ కు సై అన్న విజయసాయిరెడ్డి

విజయనగరం జిల్లా రామతీర్థంలో ఉద్రిక్తత కొనసాగుతుంది. కోదండ రాముడి ఆలయాన్ని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా అయన టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్, చంద్రబాబులపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం చేపడుతున్న ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం చూసి ఓర్వలేకనే చంద్రబాబు ఈ కుట్రకు తెరతీశారన్నారు.

టీడీపీ హయాంలో ఆలయ వ్యవస్థను నిర్వీర్యం చేసిందే చంద్రబాబు అన్నారు. బాబు హయాంలో 20 వేల ఆలయాలు మూత పడే పరిస్థితిలు నెలకొన్నాయన్నారు. తిరుపతి లో వెయ్యి మండపాన్ని తొలగించిన ఘనత చంద్రబాబుదే అన్నారు. విజయవాడలో 39 గుడులను కూలగొట్టించారన్నారు.

జగన్ ప్రభుత్వం అందిస్తున్న మంచి పాలనపై ఇది టీడీపీ కుట్రపూరిత చర్య అన్నారు. నెల్లిమర్లలో స్థలాల పంపినేని పక్కదోవ పట్టించే చర్యగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కు నారా లోకేష్ చేసిన సవాల్ కు విజయ్ సాయి రెడ్డి సై అన్నారు. సింహాచలం ఆలయంలో ప్రమాణ చేయడానికి తాను సిద్ధమన్నారు. దీంతో సవాళ్లు ప్రతి సవాళ్లతో ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి.

Related News