logo

  BREAKING NEWS

ఫలించిన ‘శ్వేత రాయబారం’.. మనసు మార్చుకున్న బుద్ధా!  |   హిందూపురంలో సీన్ రిపీట్.. అభిమానికి విశ్వరూపం చూపించిన బాలయ్య!  |   నా అనుచరుడు ఒక్కడు చాలు.. నీ పని ఖతం: టీడీపీలో బుద్ధా వర్సెస్ కేశినేని  |   అవును అప్పులు చేసాం.. ఆ విషయం గర్వంగా చెప్తాం : మంత్రి బుగ్గన  |   షాకింగ్ సర్వే.. హైదరాబాద్ లో ప్రతి ఇంట్లో ఒకరికి కరోనా!  |   అసెంబ్లీ ఎన్నికల ముందు కేరళ సీఎంకు షాక్.. విజయన్ మెడకు మళ్ళీ అదే కేసు!  |   హై కోర్టుకు ఎన్నికల సంఘం క్షమాపణలు.. ఎందుకంటే?  |   ఇదేనా దోస్తానా..? ఏపీలో అడుగుపెడుతున్న ఎంఐఎం  |   మీ పిల్ల‌ల‌కు బండిస్తున్నారా ? జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి  |   ఆరియానా గ్లోరీకి బంప‌ర్ ఆఫ‌ర్‌.. మెగా హీరో సినిమాలో ల‌క్కీ ఛాన్స్  |  

ఆ కుటుంబంలో అంతులేని విషాదం.. అరగంట వ్యవధిలో దంపతుల మృతి!

చావులోనూ వీడలేదు వారి బంధం. అరగంట వ్యవధిలో భార్య భర్తలిద్దరూ మృత్యువాత పడిన ఘటన విజయ నగరం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని ఎస్ కోట మండలం కు చెందిన అద్దంకి మనోహర్,సూర్యప్రభ దంపతులు వీరిద్దరికి లిఖిత్ అనే కుమారుడు ఉన్నాడు. కాగా మనోహర్ ఎల్ఐసీ ఉద్యోగి.

అందరితో కలివిడిగా ఉంటూ హాయిగా సాగిపోతున్న వీరి కుటుంబంలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. అర్థ రాత్రి ఒంటిగంట సమయంలో బాత్రూం కి వెళ్లి వస్తానని చెప్పిన సూర్య ప్రభ ఎంతకీ రాకపోవడంతో మనోహర్ లోపలికి వెళ్లి చూసాడు. అప్పటికే గుండె పోటు రావడంతో సూర్యప్రభ మృతి చెంది కనిపించింది.

భార్య మరణాన్ని తట్టుకోలేకపోయిన మనోహర్ కూడా అక్కడికక్కడే గుండెపోటుతో కుప్పకూలాడు. అరగంట వ్యవధిలో భార్యాభర్తలిద్దరూ మృతి చెందడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. తల్లిదండ్రులిద్దరూ మృతి చెందడంతో వీరి ఒక్కగానొక్క కొడుకు లిఖిత్ అనాథగా మారాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

 

 

Related News