logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

జీహెచ్ఎంసీ ఎన్నికలు: రంగంలోకి విజయశాంతి.. కాంగ్రెస్ కు భారీ షాక్!

టీపీసీసీ ప్రచార కమిటీ చైర్ పర్సన్ గా కొనసాగుతున్న విజయ శాంతి ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారా? ఇప్పుడు ఇదే వార్త రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న విజయశాంతి బీజేపీలో చేరనున్నారని ఆమె సన్నహిత వర్గాల నుంచి సమాచారం అందుతుంది.

మంగళవారం నాడు ఆమె ఢిల్లీకి వెళ్ళి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు కేంద్ర పెద్దల సమక్షంలో పార్టీలో చేరనున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే ఆమె బీజేపీ తరపున జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని సమాచారం. దుబ్బాక ఎన్నికల సమయంలో కేంద్ర మంత్రి విజయ శాంతితో భేటీ అయిన విషయం తెలిసిందే.

అటు బండి సంజయ్ కూడా విజయ శాంతిపై ప్రశంసలు కురిపించారు. బండి సంజయ్ అధ్యక్షుడైన నాటి నుంచి అయన కేసీఆర్ విధానాలను ఎదురుస్తున్న తీరు ఆమెను ఆకట్టుకున్నాయట. అలాగే ఇటీవల దుబ్బాకలో బీజేపీ గెలుపు విజయ శాంతిని ఆకర్షించాయని దీంతో ఆమె పార్టీలో చేరనున్నట్టు సమాచారం. కాగా తెలంగాణ ఫైర్ బ్రాండ్ గా పేరున్న విజయ శాంతి జీహెచ్ఎంసీ ఎన్నికల వేల బీజేపీ తరపున ప్రచారం చేయడం కాంగ్రెస్ కు ఎదురుదెబ్బగా చెప్తున్నారు.

Related News