logo

  BREAKING NEWS

ప‌వ‌న్ క‌ళ్యాణ్ – రామ్‌చ‌ర‌ణ్‌తో ఇండియా టాప్ డైరెక్ట‌ర్ సినిమా..?  |   ‘గుంటూరు’కు చెందిన కోహినూర్ వజ్రం బ్రిటన్ చేతికి ఎలా వెళ్ళింది?  |   బ్రేకింగ్: పంతం నెగ్గించుకున్న నిమ్మ‌గ‌డ్డ‌.. జ‌గ‌న్‌కు భారీ షాక్‌  |   వ్యాక్సిన్ అంద‌రూ తీసుకోవాలా ? క‌రోనా వ‌చ్చి త‌గ్గిన వారూ తీసుకోవాలా ?  |   గుర‌క పెడుతున్నారా..? ఈ చిట్కా పాటిస్తే జీవితంలో గుర‌క పెట్ట‌రు  |   వ‌కీల్ సాబ్ మ‌రో రికార్డు.. షూటింగ్ కాక‌ముందే రూ.15 కోట్లు వ‌చ్చేశాయి  |   తెలంగాణ కొత్త‌గా ఆరు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడెక్క‌‌డో తెలుసా ?  |   ‘మా సినిమా డైలాగులే కాపీ కొడతారా?’.. దేవినేనికి కొడాలినాని కౌంటర్  |   ముఖ్య‌మంత్రి మార్పు ఉండొచ్చు.. ఈటెల సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు  |   భూమా అఖిలప్రియ అరెస్టుపై కొడాలినాని సంచలన వ్యాఖ్యలు!  |  

రాజకీయాలపై వెనక్కి తగ్గిన తలైవా.. మరో స్టార్ హీరో పొలిటికల్ ఎంట్రీ?

రాజకీయాల్లోకి వస్తానంటూ ఎప్పటి నుంచో అభిమానులను ఊరిస్తున్న రజనీకాంత్ ఇప్పుడు ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా రాజకీయాల ఆలోచన లేదని స్పష్టం చేసారు. దీంతో ఇప్పుడు తమిళ నాట మరో కొత్త వార్త ఉపందుకుంది. రజనీకాంత్ తర్వాత తమిళనాడులో అంతటి ఫాలోయింగ్ ఉన్న హీరో తలపతి విజయ్.

గత రెండేళ్లుగా ఈ హీరో అభిమానులు కూడా విజయ్ పొలిటికల్ ఎంట్రీ కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. కానీ ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు విజయ్ రాజకీల్లోకి రాడనే సంకేతాలు ఇచ్చాయి. విజయ్ అభిమాన సంఘాలతో కలిసి కలిసి విజయ్ ఓ పార్టీ పెట్టడం దానికి విజయ్ మద్దతివ్వకపోవడమే గాక తన అభిమానులెవరు ఆ పార్టీలో చేరవద్దని బహిరంగంగానే అభిమానులకు సూచించాడు.

అయితే తాజాగా విజయ్ తన అభియాన్ సంఘం ‘మక్కళ్ ఇయక్కం’ తో ఓ రహస్య భేటీ జరిపినట్టు సమాచారం అందుతుంది. తన అభిమానులకు త్వరలోనే ఓ తీపి కబురు అందుతుందని అంతలోపు ఎవ్వరూ తొందర పడి ఇతర పార్టీలలో చేరవద్దని విజయ్ సూచించినట్టుగా దీని సారాంశం.

ఈ నేపధ్య్మలో విజయ డిసెంబర్ 31వ తేదీన దివంగత ముఖ్యమంత్రి జయలలిత సమాధి వద్ద తన పార్టీ ప్రకటించబోయే అవకాశాలు ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే మరో రెండు పోజులు ఆగాల్సిందే.

Related News