logo

  BREAKING NEWS

వ్యాక్సిన్ అంద‌రూ తీసుకోవాలా ? క‌రోనా వ‌చ్చి త‌గ్గిన వారూ తీసుకోవాలా ?  |   గుర‌క పెడుతున్నారా..? ఈ చిట్కా పాటిస్తే జీవితంలో గుర‌క పెట్ట‌రు  |   వ‌కీల్ సాబ్ మ‌రో రికార్డు.. షూటింగ్ కాక‌ముందే రూ.15 కోట్లు వ‌చ్చేశాయి  |   తెలంగాణ కొత్త‌గా ఆరు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడెక్క‌‌డో తెలుసా ?  |   ‘మా సినిమా డైలాగులే కాపీ కొడతారా?’.. దేవినేనికి కొడాలినాని కౌంటర్  |   ముఖ్య‌మంత్రి మార్పు ఉండొచ్చు.. ఈటెల సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు  |   భూమా అఖిలప్రియ అరెస్టుపై కొడాలినాని సంచలన వ్యాఖ్యలు!  |   సీఎం జగన్ ఆకస్మిక ఢిల్లీ పర్యటన.. మతలబేంటి?  |   ”జీవితకాలం శిక్షపడే కేసులు స్వీకరించం”.. అఖిలప్రియకు కోర్టు భారీ షాక్!  |   బ్రేకింగ్: కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే రోజా..!  |  

‘మాస్టర్’ రివ్యూ: విజయ్ మరో హిట్ అందుకున్నాడా?

నటీనటులు: విజయ్, విజయ్ సేతుపతి, మాళవికా మోహనన్, ఆండ్రియా, శాంతను భాగ్యరాజ్ తదితరులు
దర్శకత్వం: లోకేష్ కనగరాజ్
సంగీతం: అనిరుద్ రవిచందర్
నిర్మాత: జేవియర్ బ్రిట్టో

వరుస విజయాలతో దూసుకుపోతున్న ఇలయతలపతి విజయ్ ఈసారి మరో క్రేజీ కాంబోతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ‘ఖైదీ’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ కలిసి మాస్టర్ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాలో మరో స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో కనిపించాడు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లాక్ డౌన్ తరువాత విజయ్ నటించిన మొదటి సినిమా కావడంతో మాస్టర్ పై అటు తమిళ, తెలుగు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా ఆ అంచనాలను అందుకోగలిగిందా లేదా అనే విషయం రివ్యూలో తెలుసుకుందాం..

కథ:
జేడీ(విజయ్) మత్తుకు బానిసైన ఓ కాలేజ్ ప్రొఫెసర్. బాధ్యతలేని తనంతో ఆ కాలేజీలో సహోద్యోగులు పెద్ద తలనొప్పిగా మారతాడు. కానీ స్టూడెంట్స్ కు మాత్రం జేడీ అంటే మహా ఇష్టం. జేడీ కారణంగా అతను పనిచేసే కాలేజీలో విద్యార్థి సంఘాల ఎన్నికలు జరపాల్సి వస్తుంది. ఈ సందర్భంగా జరిగిన వివాదం కారణంగా జేడీని బాల నేరస్థుల హోమ్ కి తరలిస్తారు. అక్కడ వారికి పాఠాలు చెప్పడానికి జేడీని నియమిస్తారు. వరంగల్ జిల్లాలో పేరు మోసిన రౌడీ అయిన భవాని(విజయ్ సేతుపతి) ఆ హోమ్ ను అడ్డుపెట్టుకుని
అరాచకాలు సాగిస్తుంటాడు. ఈ క్రమంలో జేడీ భవానితో తలపడాల్సి వస్తుంది. మొదట అల్లరి చిల్లరగా తిరిగే జేడీ బాల నేరస్తుల కోసం ఉన్న ఫలంగా ఎందుకు మారతాడు? వారితో అతనికున్న సంబంధం ఏమిటి? భవానిని ఎలా ఎదిరిస్తాడు? అనేదే సినిమా కథాంశం.

విశ్లేషణ:
తాను అనుకున్నది సాధించడానికి ఎంతటి దారుణానికైనా ఒడిగట్టే క్రూరుడిగా విజయ్ సేతుపతి కనిపిస్తాడు. సినిమా చూసిన వారెవరూ అతని పాత్రను మరిచిపోలేరు. బాధ్యతలేని తాగుబోతు కాలేజీ ప్రొఫెసర్ పాత్రలో విజయ్ ఎప్పటిలాగే అదరగొట్టాడు. వీరిద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడి నటించారు. హీరోయిన్ గా నటించిన మాళవిక మోహనన్ పాత్రకు అంతగా ప్రాధాన్యం లేకపోయినా అందంగా కనిపించి ఆకట్టుకుంది. మిగిలిన పాత్రధారులు పరిధి మేర నటించి పరవాలేదనిపించారు.

స్టార్ హీరో ని డైరెక్ట్ చేయాలంటే ఎలాంటి దర్శకుడైనా ఆ హీరో అభిమానులను దృష్టిలో పెట్టుకుని సినిమా తీయాల్సి ఉంటుంది. అందుకు లోకేష్ కనగరాజ్ ఏమి మినహాయింపు కాదనిపించాడు. గతంలో ఖైదీ లాంటి మాస్ సినిమాతో మాస్ ఎంటర్టైనర్ తో మెప్పించిన ఈ దర్శకుడు ఇప్పుడు విజయ్ కోసం కొంచెం క్లాస్ సబ్జెక్టునే ఎంచుకున్నాడు. అయితే ఈ సినిమాలో ఖైదీ సినిమాలో లాగా త్రిల్లింగ్ కు గురి చేసే కథా కథనాలు ఆశించలేము. విజయ్ సినిమాను అభిమానులు ఎలా ఉండాలని కోరుకుంటారో ఆ ఫార్ములానే దర్శకుడు ఫాలో అయ్యాడని అనిపిస్తుంది. అది మిగిలిన ప్రేక్షకులను కొంత నిరాశపరచవచ్చు. కానీ ఇద్దరు హీరోలను హ్యాండిల్ చేసిన విధానం బాగుంది. హీరోయిజం ఎలివేట్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. అయితే కథ ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టుగా సాగిపోతుంది. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా హీరో ఎలివేషన్ సీన్లతో నడిపించేస్తాడు. సెకండ్ హాఫ్ లో సాగదీత సీన్లు కనిపిస్తాయి. హీరో విలన్ల మధ్య సాగే సన్నివేశాలు అంత ఆసక్తిగా అనిపించకపోవడం ఈ సినిమాకు ఒక మైనస్ గా నిలిచింది. ఇక ఎప్పటిలాగే సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అలరిస్తుంది. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి. బాల నేరస్థుల పై ఎంచుకున్న కథాంశం కొత్తగా అనిపిస్తుంది.

మైన్స్ పాయింట్స్:
ఇక సినిమాలో సాగదీత సీన్లు, కథలో సస్పెన్స్ లేకపోవడం మైనస్ పాయింట్స్ గా నిలిచాయి.

ప్లస్ పాయింట్స్:
విజయ్ విజయ్ సేతుపతి నటన మాస్టర్ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. అనిరుధ్ మ్యూజిక్, యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్లస్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు.

మాస్టర్ సినిమాకి విజిల్ మీడియా ఇచ్చే రేటింగ్: 2.5/5

Related News