తమిళ స్టార్ హీరో విజయ్ తలపతి రాజకేయాల్లోకి ఎంట్రీ ఇస్తారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తలపతి హీరోగా తెరకెక్కిన ‘మాస్టర్’ సినిమాపై భారీ ఉత్కంఠ నెలకొంది. ‘ఖైదీ’, ‘నగరం’ సినిమాలతో సంచలన విజయాలను నమోదు చేసుకున్న లోకేష్ కానగరాజన్ దర్శకత్వంలో వస్తున్న మాస్టర్ సినిమాలో మరో స్టార్ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నాడు.
అయితే ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 13 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ కు ఊహించని షాక్ తగిలింది. విడుదల ముందే మాస్టర్ సినిమాకు సంబందించిన కొన్ని సీన్లు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఈ ఘటనపై సినిమా దర్శకుడు లోకేష్ కానగరాజన్ భావోద్వేగానికి లోనయ్యారు.
ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ద్వారా ఓ సందేశాన్నిచ్చారు. సంవసరంన్నర కాలంగా ఎంతో మంది శ్రమించి సినిమాను మీ ముందుకు తెస్తున్నాం. ఈ సినిమా విడుదలకు ఇంకా ఒక్క రాజు మాత్రమే ఉంది. ఈ సినిమాను ప్రేక్షకులతో థియేటర్లలోనే ఆస్వాదించాలని కోరుతున్నాము. మీ దగ్గరకు మాస్టర్ సినిమా లీకైన సన్నివేశాలు వస్తే దయచేసి వాటిని షేర్ చేయకండి అంటూ సినిమా దర్శకుడు విజ్ఞప్తి చేసారు.