logo

  BREAKING NEWS

ఎన్నిక‌ల్లో గెలిస్తే ఉచితంగా క‌రోనా వ్యాక్సిన్‌… బీజేపీ హామీ  |   18 నెల‌ల జైలు జీవితం.. ఒక్క మాట‌తో వైఎస్సార్‌కు రాజీనామా లేఖ‌  |   కిడ్నాప్ చేసిన గంట‌లోనే హ‌త్య చేశారు.. ఆ భ‌యంతోనే..!  |   దీక్షిత్‌ను పొట్ట‌న పెట్టుకున్న కిడ్నాప‌ర్లు  |   మ‌ళ్లీ తెర‌పైన శ్రీహ‌రి, సౌంద‌ర్య‌ను చూసే అరుదైన‌ అవ‌కాశం  |   కేసీఆర్‌తో గొడ‌వ ఎక్క‌డ మొద‌లైందో చెప్పిన కోదండ‌రాం  |   ఆర్థిక ఇబ్బందుల్లో ప్ర‌ధాని.. ఈ క‌ష్టాలు ఎవ‌రికీ రావేమో..!  |   క‌ర్నూలు మ‌హిళ‌కు దొరికిన‌ కోటి రూపా‌యల వ‌జ్రం  |   బ్రేకింగ్‌: క‌రోనా వ్యాక్సిన్‌పై ప్ర‌ధాని మోడీ కీల‌క ప్ర‌క‌ట‌న‌  |   ద‌సరా పండుగ రోజు జ‌మ్మి చెట్టుకు ఎందుకు పూజిస్తారో తెలుసా ?  |  

ప్ర‌భుత్వానికి మాల్యా అభినంద‌న‌లు.. డ‌బ్బులు క‌డ‌తా తీసుకోండి

క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో 20 ల‌క్ష‌ల కోట్ల భారీ ప్యాకేజీ ప్ర‌క‌టించిన కేంద్ర ప్ర‌భుత్వానికి లిక్క‌ర్ కింగ్ విజ‌య్ మాల్యా అభినంద‌న‌లు తెలిపాడు. ఈ మేర‌కు ట్వీట్ చేసిన మాల్యా.. 20 ల‌క్ష‌ల ప్యాకేజీ ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వానికి అభినంద‌న‌లు. ప్ర‌భుత్వం ఎన్ని డ‌బ్బులు కావాలంటే అన్ని డ‌బ్బులు ప్రింట్ చేయ‌వ‌చ్చు. కానీ, నేను బ్యాంకుల‌కు బాకీ ప‌డ్డ రుణాలు మొత్తం తిరిగి చెల్లిస్తాను అంటే ఎందుకు విన‌డం లేదు. బేష‌ర‌తుగా నా డ‌బ్బులు తీసుకొని కేసు మూసివేయండి అని పేర్కొన్నాడు.

కాగా, బ్యాంకుల‌కు 9 వేల కోట్ల‌కు పైగా రుణాలు ఎగ‌వేసిన విజ‌య్ మాల్యా ప్ర‌స్తుతం దేశం నుంచి పారిపోయి లండ‌న్‌లో త‌ల‌దాచుకున్న సంగ‌తి తెలిసిందే. తాను బ‌కాయి ప‌డ్డ అన్ని డ‌బ్బుల‌ను వంద శాతం చెల్లిస్తాన‌ని, త‌న‌పై కేసును కొట్టేసేలా ఆదేశాలు ఇవ్వాల‌ని ఆయ‌న లండ‌న్ కోర్టులో పిటీష‌న్ దాఖ‌లు చేశారు. ఒకప్పుడు లిక్క‌ర్ సామ్రాజ్యం ద్వారా ఓ వెలుగు వెలిగిన విజ‌య్ మాల్యా కింగ్‌ఫిష‌ర్ ఎయిర్‌లైన్స్ స్థాపించిన మొత్తం న‌ష్ట‌పోయి బ్యాంకుల‌కు టోపీ పెట్టిన సంగ‌తి తెలిసిందే.

Related News