logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

ఏడో నిజాం కుమార్తె బషీర్ ఉన్నీసా బేగం కన్నుమూత

హైదరాబాద్ ను పాలించిన ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కుమార్తె సాహెబ్జాది బషీర్ ఉన్నీసా బేగం సాహెబా కన్నుమూశారు. మంగళవారం తెల్లవారుజామున ఆమె తుది శ్వాస విడిచారు. ఆమె మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేసారు. నిజాం నవాబుకు తన 21వ ఏట ఏప్రిల్ 14, 1906లో అజం ఉన్నీసా తో వివాహం జరిగింది. నిజాం కు మొత్తం 34 సంతానం కాగా అందులో బషీర్ ఉన్నీసా ఒకరు.

నిజం నవాబు దంపతులకు 1927 లో బషీర్ ఉన్నీసా జన్మించారు. ఉస్మాన్ అలీ ఖాన్ ఆమెకు అలీ పాషా మర్హూమ్‌ తో వివాహం జరిపించారు. ఏడో నిజాం సంతానంలో ఇప్పటివరకు బతికున్న ఏకైక మహిళ బషీర్ ఉన్నీసా. ఉస్మాన్ అలీఖాన్ మొదటి ఇద్దరు కుమారుల్లో ఒకరు అజంజాహి కాగా రెండో కుమారుడు మొజాంజాహి. ఏడో నవాబు కాలంలోనే హైదరాబాద్ ను అభివృద్ధి పరిచారు. అందులో ఉస్మానియా విశ్వవిద్యాలయం కూడా ఒకటి.

Related News