logo

  BREAKING NEWS

రామనాయుడుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ సీఎం జగన్!  |   మైండ్‌బ్లాక్ అయ్యే రీతిలో ”వ‌కీల్ సాబ్” రెమ్యున‌రేష‌న్‌  |   ఎమ్మెల్యేకు క‌రోనా.. ఏపీ అసెంబ్లీలో కోవిడ్ క‌ల‌వ‌రం  |   అంద‌రికీ వ్యాక్సిన్ అవ‌స‌రం లేదు… వ్యాక్సిన్ వ‌చ్చినా మాస్కులు త‌ప్ప‌వు  |   ఏపీ అసెంబ్లీ: చంద్రబాబు స్పీకర్ మధ్య మాటల యుద్ధం!  |   ప్ర‌భాస్ – ప్ర‌శాంత్ నీల్ తీసేది రీమేక్ సినిమా.. ఇంత రిస్క్ ఎందుకు..?  |   ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం.. ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం!  |   పేద విద్యార్థులకు ఎల్ఐసీ స్కాల‌ర్‌షిప్‌లు.. పూర్తి వివ‌రాలు ఇవీ  |   బ్రేకింగ్: గ్రేటర్ లోని ఆ ప్రాంతంలో పోలింగ్ రద్దు: ఎన్నికల సంఘం  |   కేంద్రంపై రైతుల దండయాత్ర ఎందుకు? నూతన వ్యవసాయ చట్టాల్లో ఏముంది?  |  

విద్యుల్లేఖను ఎప్పుడైనా ఇలా చూసారా..? షాకిచ్చిన నటి!

తమిళ, తెలుగు భాషల్లో ఉన్న లేడీ కమెడియన్ల కొరతను తీరుస్తూ 2012 లో వెండి తెరకు ఎంట్రీ ఇచ్చారు విద్యుల్లేఖ రామన్. తనదైన కామెడీ టైమింగ్ తో తెరపై నవ్వులు పూయించే ఈ నటి తాజాగా ఓ ఫోటోను పోస్ట్ చేసి అందరికీ షాకిచ్చారు. ఎవరూ ఊహించలేనంతగా సన్నజాజిలా మారిపోయారు ఆమె. అందుకు సంబందించిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ.. నకిలీ విశ్వాసం వర్సెస్ నిజమైన విశ్వాసం అని పోస్ట్ చేశారు. ఆమె తాజా లుక్ చుసిన వారంతా ఇదెలా సాధ్యమైందంటూ ఆశ్చర్యపోతున్నారు.

ఆమె ఇంతలా బరువు తగ్గడానికి గల కసరత్తులు గురించి కూడా ఆమె వివరించారు. గతంలో ఎవరైనా తన శరీర ఆకృతి గురించి ప్రస్తావించి మీరు కాన్ఫిడెంట్ గా ఉన్నారా అంటూ అడిగితే తనపై తనకే అనుమానం కలిగేది అని తెలిపారు. ఇప్పుడు తాను నిజమైన ఆత్మవిశ్వాసాన్ని పొందుతున్నానని పేర్కొన్నారు. అయితే తాను బరువు తగ్గే ప్రక్రియలో ఫాట్ తగ్గించే డ్రింకులను గాని, మాత్రలను గాని ఉపయోగించలేదని తెలిపారు.

వారానికి ఆరు రోజులు వ్యాయామం చేసానని జీవన శైలిని మార్చుకుని మంచి డైట్ ను పాటించడం వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు. మనసు పెట్టి ప్రయత్నిస్తే ఏదైనా సాధించగలమనే నమ్మకం ఇప్పుడు తనలో కలిగిందన్నారు. కాగా తమిళ నటుడు మోహన్ రామన్ కుమార్తె విద్యుల్లేఖ. మొదటిసారిగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ‘ఏటో వెళ్ళిపోయింది మనసు’ సినిమాలో సమంత స్నేహితురాలి పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఆమె తమిళ, తెలుగు సినిమాల్లో స్టార్ లేడీ కమెడియన్ గా దూసుకుపోతున్నారు.

Related News