logo

  BREAKING NEWS

ఓటీటీలో రిలీజైన కేజీఎఫ్: చాప్ట‌ర్‌-2..! కానీ షాకిచ్చిన అమెజాన్ ప్రైమ్‌  |   టాయిలెట్‌లో కెమెరా.. హోంమంత్రికి ఫిర్యాదు  |   కాబోయే భ‌ర్త మృతి.. ఆ యువ‌తి చేసిన ప‌నికి క‌న్నీళ్లు ఆగ‌వు  |   స‌లార్ సినిమాపై కిక్కిచ్చే వార్త‌  |   మ‌హేష్ – రాజ‌మౌళి సినిమాపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన విజ‌యేంద్ర ప్ర‌సాద్‌  |   వంద‌ల ఎక‌రాల భూమి ఉన్న కుటుంబంలో కేసీఆర్ పుట్టారు  |   2022 – 23కు కేంద్రీయ విద్యాల‌య అడ్మిష‌న్లు ప్రారంభం.. పూర్తి వివ‌రాలు  |   నిరుద్యోగుల‌కు భారీ శుభ‌వార్త‌.. రైల్వేలో 2,65,547 ఖాళీలు  |   మ‌రో కొత్త ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్న జ‌గ‌న్‌.. దేశంలోనే మొద‌టిసారి  |   అండ‌మాన్ ఎన్నిక‌ల్లో మ‌రోసారి స‌త్తా చాటేందుకు చంద్ర‌బాబు స్కెచ్‌  |  

కేసీఆర్ పుట్టిన రోజు: కేకులే కాదు పీకలు కూడా కోశారు : విహెచ్ సంచలన వ్యాఖ్యలు!

హైకోర్టు లాయర్ దంపతుల దారుణ హత్య పై తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ హన్మంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఏడాది కేసీఆర్ పుటిన రోజున తెలంగాణలో మొక్కలు నాటడం, కేకులు కోయడంతో పాటుగా ఈ దారుణ హత్యలు కూడా జరిగాయన్నారు. ప్రజలు ఈ హత్యలనే గుర్తు చేసుకుంటారన్నారు. పుట్టినరోజున కేకు కట్ చేసినంత ఈజీగా పీకలు కట్ చేసారని ఆవేదన వ్యక్తం చేసారు.

న్యాయవాదులు హత్యకు గురైన వారి స్వగ్రామం మంథని మండలం గుంజపడుగులో విహెచ్ పర్యటించారు. హత్య జరిగిన స్థలాన్ని పరిశీలించారు. పట్టపగలు నడిరోడ్డుపై ఇలాంటి ఘటనలు జరగడం ఏమిటని అన్నారు. తెలంగాణాలో పోలీసు వ్యవస్థ నీరసించిపోతుందన్నారు. అధికారులను హత్యకు సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటన కిరాతకంగా చర్యగా పేర్కొన్నారు.

సీఎం పుట్టిన రోజు నాడు జరిగిన ఈ ఘటనలో టీఆర్ఎస్ నేతల ప్రమేయం ఉన్నా మంత్రులు, ఆ పార్టీ నేతలు స్పందించకపోవడం దారుణమన్నారు. బాధితుల బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్న వారి పేర్లను నిందితుల జాబితాలో ఎందుకు చేర్చడం లేదని ప్రశ్నించారు.

Related News