logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

రేవంత్ రెడ్డికి పీసీసీ ఇస్తే.. విహెచ్ సంచలన వ్యాఖ్యలు!

తెలంగాణ పీసీసీ పదవికి రేవంత్ రెడ్ది పేరు దాదాపుగా ఖరారైనట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి ఇస్తే తాను పార్టీ లో ఉండనన్నారు. తానే కాదు నేతలంతా ఎవరి దారి వారు చేసుకుంటారన్నారు. పార్టీ కోసం పని చేసే కోమటిరెడ్డి, జగ్గారెడ్డి కూడా పార్టీ పగ్గాలు చేపట్టేందుకు పనికిరారా? అని విహెచ్ ప్రశ్నించారు.

తెలంగాణకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తికి పదవి ఇస్తారా? రాష్ట్రం కోసం పోరాడిన మేమంతా జైళ్ల చుట్టూ తిరగాలా? అంటూ విహెచ్ ధ్వజమెత్తారు. ఓ వైపు బీజేపీ రాష్ట్రంలో పెరిగిపోతుంది. ఆర్ఎస్ఎస్ వ్యక్తికి పీసీసీ పదవి ఇస్తే తామంతా ఎలా కలిసి పనిచేయాలన్నారు. రేవంత్ కె కాదు నాకు కూడా అంతే క్రేజ్ ఉందన్నారు. అసలు రేవంత్ రెడ్డికి ఇంత డబ్బు ఎక్కడిది? నువ్వు నిక్కర్లు వేసుకునేప్పుడే నేను లీడర్ ను. ఇప్పుడు నా దగ్గర పైసల్ లేవు నీ దగ్గర ఎలా ఉన్నాయంటూ విహెచ్ ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డి స్క్రిప్ట్ ను ఢిల్లీలో అధిష్టానం అమలు చేస్తుందన్నారు. రేవంత్ తెలుగుదేశం పార్టీలో ఉంటె ఆ పార్టీ మునిగింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా మునుగుతుందన్నారు. 2018 నుంచి తనకు అధిష్టానాన్ని కలవడానికి అపాయింట్ మెంట్ దూరకడం లేదని దాని వెనుక కొన్ని శక్తులు ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం విహెచ్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

Related News