logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

ఈ మెసేజిలు ఓపెన్ చేస్తే ప్రమాదమే: వాట్సాప్

వాట్సాప్ వినియోగదారులకు పిడుగులాంటి వార్త వినిపించింది. లాక్ డౌన్ సమయంలో అత్యధికంగా ఈ యాప్ వినియోగం 40 శాతం పెరిగింది. అయితే ఇదే అదునుగా భావించి సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉందంటుంది వాట్సాప్ టెక్నీకల్ టీమ్. ఈ విధంగా తమ యూజర్లకు హెచ్చరికలు జారీ చేసింది. ఎవరైనా వాట్సాప్ ద్వారా మీ అకౌంట్ ను రీ వెరిఫై చేయాలని చెబుతూ వచ్చే మెసేజ్లను నమ్మవద్దని తెలిపింది.

అలాంటి మెసేజిలు ఓపెన్ చేసినప్పుడు మోసగాళ్లు ఆరు అంకెల నంబర్ ను పంపి దానిని ఎంటర్ చేయవలసిందిగా కోరతారని ఈ విధంగా చేస్తే యూజర్ డేటా మొత్తం వారు హ్యాక్ చేస్తారని తెలిపింది. అప్పుడు చాట్, ఫొటోస్, వీడియోస్ తో పాటుగా యూజర్ వ్యక్తిగత సమాచారమంతా వారి చేతికి చిక్కుతుందని తెలిపారు. వాట్సాప్ నుండి కేవలం వెరిఫై చేయబడిన బ్లూ టిక్ నుండి మాత్రమే మెసేజ్ వస్తుందని తెలిపారు.

ఈ మెసేజిలను స్నేహితులు, బందువులకు కూడా ఫార్వార్డ్ చేయవద్దని కోరింది. లాక్ డౌన్ సమయంలో యూజర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని వాట్సాప్ టీమ్ పేర్కొంది. ఒకవేళ మీ అకౌంట్ హ్యాక్ అయినట్టుగా అనుమానం ఉంటె వెంటనే అకౌంట్ ను డిలీట్ చేసి మరోసారి వెరిఫై చేసుకోవాలని తెలిపింది.

Related News