logo

  BREAKING NEWS

మీ పిల్ల‌ల‌కు బండిస్తున్నారా ? జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి  |   ఆరియానా గ్లోరీకి బంప‌ర్ ఆఫ‌ర్‌.. మెగా హీరో సినిమాలో ల‌క్కీ ఛాన్స్  |   ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆ నోటిఫికేషన్ రద్దు!  |   బ్రేకింగ్: తాజ్ మహల్ కు బాంబు బెదిరింపు..!  |   మున్సిప‌ల్ ఎన్నిక‌లపై సీక్రెట్ స‌ర్వే.. రిజ‌ల్ట్ చూసి షాకైన జ‌గ‌న్‌  |   బంగారం కొనేవారికి బ్యాడ్‌ న్యూస్.. పెరిగిన బంగారం ధ‌ర‌లు  |   బ్రేకింగ్: నిమ్మగడ్డ వివాదాస్పద నిర్ణయానికి హైకోర్టు బ్రేకులు.. భారీ ఎదురుదెబ్బ!  |   ఆనాడు జగన్ ను అడ్డుకున్నారు.. బాబుపై ఏపీ మంత్రి ధ్వజం  |   మంత్రి కేటీఆర్ కు సవాల్.. ఓయూ క్యాంపస్ దగ్గర ఉద్రిక్తత!  |   హైటెన్షన్: చంద్రబాబుకు షాకిచ్చిన పోలీసులు.. ఎయిర్పోర్టులో బైఠాయింపు!  |  

నిమ్మగడ్డకు ఉద్యోగ సంఘాల కౌంటర్: వెంకట్రామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!

ఏపీలో పంచాయతీ ఎన్నికల రగడ కొనసాగుతోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యేవరకు ఎన్నికల విధుల్లో పాల్గొనలేమంటూ మరోసారి స్పష్టం చేసాయి ఉద్యోగ సంఘాలు. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధి వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసారు.

చర్చలు జరపడం అంటే కాఫీ తాగి వెళ్లడం కాదన్నారు.13 వతేదీ తర్వాత చర్చించి నిర్ణయం తీసుకుందామని ప్రభుత్వం చెప్తున్నా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శించారు. తాము ఎన్నికలు వద్దని అనడం లేదని తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని మాత్రమే కోరుతున్నామన్నారు.

ప్రాణాలమీదకు వస్తే ఎదుటి వ్యక్తి ప్రాణాలు తీసే హక్కు రాజ్యాంగం కల్పించిందన్నారు. ఇది అంతకన్నా పెద్డదా? అంటూ ఆయన ప్రశ్నించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు వాక్సిన్ ఇచ్చేంతవరకు తాము విధుల్లో పాల్గొనలేమన్నారు. కరోనా కారణంగా తమ ప్రాణాలకు ముప్పు ఉందనే భయంతోనే ఎన్నికలను వ్యతిరేకిస్తున్నామన్నారు.

విధుల్లో పాల్గొనాలనే వారితో ఎన్నికలు నిర్వహించుకోవాలి. కరోనా కారణంగా దూరంగా ఉండాలనుకునే వారిని ఆ అవకాశం ఇవ్వాలని కోరారు. ఒకవైపు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ మరోవైపు ఎన్నికల విధులకు ఉద్యోగులే లేరనడం గమనార్హం అన్నారు తమకు సుప్రీం కోర్టులో న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు.

Related News