logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం..!

తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను గడగడలాడించిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్. గంధపు చెక్కల స్మగ్లింగ్ మొదలు సినీ ప్రముఖుల కిడ్నాప్ ల వరకు అతను సాగించిన అరాచకాలు తెలియని వారుండరు. 2004లో వీరప్పన్ పోలీసుల ఎన్ కౌంటర్ లో హతమయ్యాడు. వీరప్పన్ మరణాంతరం ఆయన భార్య ముత్తు లక్ష్మి పైనా పోలీసులు కేసు పెట్టారు. ఆమె చాలా కాలం పాటు తన భర్త ఎన్ కౌంటర్ విషయంలో పోరాటాం జరిపింది. వీరప్పన్ చనిపోయే నాటికి అతనికి ఇద్దరు కుమార్తెలు.

వారిలో పెద్ద కూతురు విద్యారాణి(30). తండ్రి చనిపోయే నాటికి ఆమె వయసు 14 ఏళ్ళు. న్యాయ శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసిన విద్య.. ఒకవైపు ప్రాక్టీస్ చేస్తూనే, మరోవైపు సామాజిక కార్యకర్తగానూ పనిచేస్తూ వచ్చింది. ఇప్పుడు విద్యారాణి తమిళనాడు రాజకీయాల్లో సంచలనంగా మారింది. సుమారు 3 వేల మంది అనుచరులతో విద్యా రాణి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో తండ్రి వీరప్పన్ పై విద్యారాణి చేసిన ప్రసంగం హైలెట్ గా నిలిచింది.

‘నా తండ్రి వీరప్పన్ ఎంచుకున్నది తప్పుడు మార్గమే, ఆయన జీవితకాలం అదే మార్గం లో వెళ్ళాడు. దానిని నేను గాని నా కుటుంబం గాని ఎప్పుడు సమర్థించబోము. కానీ అయన చివరి శ్వాస వరకు బ్రతికింది పేదల కోసమే. బడుగు బలహీన వర్గాలు, ఆడబిడ్డలు బాగుండాలని అయన చివరి శ్వాస వరకు పోరాడారు. ఇప్పటికీ వందల గ్రామాలు నా తండ్రిని దేవుడిగా కొలుస్తున్నాయి. ఆయన ఎందుకు ఆ మార్గాన్ని ఎంచుకున్నారన్నదే ముఖ్యం. ఆయన నాకెప్పుడూ హీరోనే’ అంటూ విద్యారాణి చేసిన ప్రసంగానికి సభా ప్రాంగణం దద్దరిల్లింది.

ఆమె పార్టీలో చేరి ఆరు నెలలు తిరగక ముందే విద్య రాణికి తమిళనాడు బీజేపీ కీలక పదవి కట్టబెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆమెకు యువమోర్చా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా బీజేపీ నియమించింది. తాజా నియామకం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. అయితే మరి కొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. తమిళనాడులోని క్రిష్ణగిరి వీరప్పన్ ప్రాభల్యం అధికంగా ఉన్న ప్రాంతం. విద్యారాణి కూడా కృష్ణ గిరి లో కొన్ని పాఠశాలలను నిర్వహించి అక్కడి ప్రజలకు సేవ చేస్తుంది.

Related News