logo

  BREAKING NEWS

బ్రేకింగ్‌: తెలంగాణ‌లో ఇక వారికి 10 శాతం రిజ‌ర్వేష‌న్లు  |   పంచాయతీ ఎన్నికలు: నిమ్మగడ్డకు ఉద్యోగ సంఘాల షాక్!  |   ‘కాబోయే సీఎం కంగ్రాట్స్’ వేదికపైనే షాకిచ్చిన మంత్రి.. కేటీఆర్ రియాక్షన్ ఇదే!  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్ – రామ్‌చ‌ర‌ణ్‌తో ఇండియా టాప్ డైరెక్ట‌ర్ సినిమా..?  |   ‘గుంటూరు’కు చెందిన కోహినూర్ వజ్రం బ్రిటన్ చేతికి ఎలా వెళ్ళింది?  |   బ్రేకింగ్: పంతం నెగ్గించుకున్న నిమ్మ‌గ‌డ్డ‌.. జ‌గ‌న్‌కు భారీ షాక్‌  |   వ్యాక్సిన్ అంద‌రూ తీసుకోవాలా ? క‌రోనా వ‌చ్చి త‌గ్గిన వారూ తీసుకోవాలా ?  |   గుర‌క పెడుతున్నారా..? ఈ చిట్కా పాటిస్తే జీవితంలో గుర‌క పెట్ట‌రు  |   వ‌కీల్ సాబ్ మ‌రో రికార్డు.. షూటింగ్ కాక‌ముందే రూ.15 కోట్లు వ‌చ్చేశాయి  |   తెలంగాణ కొత్త‌గా ఆరు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడెక్క‌‌డో తెలుసా ?  |  

ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే ఏపీ సీఎం ఎవ‌రు ? వీడీపీ స‌ర్వేలో కీల‌క అంశాలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వం ఏర్ప‌డి ఏడాదిన్నర కావొస్తున్న నేప‌థ్యంలో వీడీపీ అసోసియేట్స్ అనే సంస్థ ఓపీనియ‌న్ పోల్ స‌ర్వే నిర్వ‌హించింది. రాష్ట్ర ప్ర‌జ‌ల మ‌నోగ‌తం ఎలా ఉంది ? జ‌గ‌న్ ప్ర‌భుత్వ ప‌నితీరుపై వారి అభిప్రాయ‌మేంటి ? ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే ప్ర‌జ‌లే ఎటువైపు ఉంటారు ? వ‌ంటి అనేక కీల‌క అంశాల‌పై ఈ స‌ర్వే సాగింది. ఈ స‌ర్వేలో ఆస‌క్తిక‌ర అంశాలు వెల్ల‌డ‌య్యాయి.

1. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వై.ఎస్‌. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌నితీరుపై రాష్ట్రంలో 63 శాతం మంది సంతృప్తిగా ఉండ‌గా, 37 శాతం మంది అసంతృప్తిగా ఉన్నారు.

2. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప‌నితీరుపైన ఏపీలో 59 శాతం మంది సంతృప్తిగా ఉండ‌గా, 41 శాతం మంది అసంతృప్తిగా ఉన్నారు.

3. క‌రోనా వైర‌స్‌ను ఎదుర్కోవ‌డంలో రాష్ట్ర ప్ర‌భుత్వం బాగా ప‌ని చేస్తుంద‌ని 73 శాతం మంది చెప్ప‌గా, 27 శాతం మంది అసంతృప్తి వ్య‌క్తం చేశారు.

4. క‌రోనాను ఎదుర్కోవ‌డంలో కేంద్రం ప‌నితీరు ప‌ట్ల 57 శాతం మంది సంతృప్తిని, 43 శాతం మంది అసంతృప్తిని వ్య‌క్తం చేశారు.

5. రాష్ట్రంలో వైసీపీకి బ‌ల‌మైన ప్ర‌తిప‌క్షం ఏ పార్టీ అని భావిస్తున్నారు అని అడిగిన ప్ర‌శ్న‌కు.. 59 శాతం మంది టీడీపీ అని చెప్పారు. 8 శాతం మంది బీజేపీ అని, 4 శాతం మంది జ‌న‌సేన అని, ఒక శాతం మంది కాంగ్రెస్ అని, 28 శాతం మంది చెప్ప‌లేమ‌ని స‌మాధాన‌మిచ్చారు.

6. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే ఎవ‌రు ముఖ్య‌మంత్రి కావాలి అనుకుంటున్నారు అని అడిగిన ప్ర‌శ్న‌కు.. 53.40 శాతం మంది వైఎస్ జ‌గ‌న్ కావాల‌ని చెప్పారు. 40.60 శాతం మంది చంద్ర‌బాబు కావాల‌ని, 3.90 శాతం మంది ప‌వ‌న్ క‌ళ్యాణ్ కావాల‌ని, 1.10 శాతం మంది ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి కావాల‌ని, 1.00 శాతం మంది క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ కావాల‌ని చెప్పారు.

7. ఇప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 52.97 శాతం ఓట్ల‌తో మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తుంద‌ని, టీడీపీ 40.06 శాతం ఓట్ల‌తో ప్ర‌తిప‌క్షానికి ప‌రిమితం అవుతుంద‌ని ఈ స‌ర్వేలో తేలింది. జ‌న‌సేన‌కు 3.56 శాతం ఓట్లు, బీజేపీకి 2.2 శాతం, కాంగ్రెస్‌కు 0.6 శాతం ఓట్లు వ‌స్తాయ‌ని తేలింది. అంటే వైసీపీకి గ‌త ఎన్నిక‌ల కంటే 3.2 శాతం ఓట్లు పెరుగుతాయి.

8. ప్రైవేటు సంస్థ‌ల్లో స్థానికుల‌కు రిజ‌ర్వేష‌న్లు ఇవ్వాల‌ని 91 శాతం మంది, వ‌ద్ద‌ని 9 శాతం మంది చెప్పారు.

9. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టాల‌ని 89 శాతం మంది, వ‌ద్ద‌ని 11 శాతం మంది అభిప్రాయ‌ప‌డ్డారు.

10. గ్రామ వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌పైన 64 శాతం మంది సంతృప్తి వ్య‌క్తం చేయ‌గా 36 శాతం మంది అసంతృస్తితో ఉన్నారు.

11. స్పంద‌న కార్య‌క్ర‌మం ప‌ట్ల 62 శాతం మంది, నాడు – నేడు కార్య‌క్ర‌మంపై 61 శాతం మంది సంతృప్తి వ్య‌క్తం చేశారు.

12. ఇసుక ల‌భ్య‌త‌పై మాత్రం 59 శాతం మంది ప్ర‌భుత్వంపై అసంతృప్తి వ్య‌క్తం చేశారు.

Related News