logo

  BREAKING NEWS

ఏపీ అసెంబ్లీ: చంద్రబాబు స్పీకర్ మధ్య మాటల యుద్ధం!  |   ప్ర‌భాస్ – ప్ర‌శాంత్ నీల్ తీసేది రీమేక్ సినిమా.. ఇంత రిస్క్ ఎందుకు..?  |   ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం.. ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం!  |   పేద విద్యార్థులకు ఎల్ఐసీ స్కాల‌ర్‌షిప్‌లు.. పూర్తి వివ‌రాలు ఇవీ  |   బ్రేకింగ్: గ్రేటర్ లోని ఆ ప్రాంతంలో పోలింగ్ రద్దు: ఎన్నికల సంఘం  |   కేంద్రంపై రైతుల దండయాత్ర ఎందుకు? నూతన వ్యవసాయ చట్టాల్లో ఏముంది?  |   అసెంబ్లీలో రగడ: చంద్రబాబు సహా టీడీపీ సభ్యుల సస్పెండ్!  |   కరోనా పుట్టింది ఎక్కడో కాదు భారత్ లోనే..? చైనా సంచలన ఆరోపణలు!  |   అమిత్ షా వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్!  |   ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తేనే కదా తెలిసేది: కేసీఆర్ పై అమిత్ షా  |  

అనసూయ, రష్మిలకు గట్టి పోటీనిస్తున్న ఈ కొత్త అమ్మాయి ఎవరు?

జబర్దస్త్ కామెడీ షోతో ఇప్పటివరకు ఎంతో మంది కమెడియన్లు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అందులో కొందరు హీరోలుగా కూడా మారిపోయారు. అయితే ఈ షో ద్వారా అంతలా పాపులర్ అయిన వాళ్లలో ఈ షో యాంకర్లు కూడా ఉన్నారు. ఈషోలో ఎన్ని విబేధాలు వచ్చినా యాంకర్ అనసూయ మాత్రం షోను విడిచి పెట్టలేదు. సినిమాల్లో నటిస్తూ ఎంత బిజీగా ఉన్నా షోను కంటిన్యూ చేస్తుంది.

రష్మీ కూడా జబర్దస్త్ ను కేరాఫ్ అడ్రస్ గా మార్చేసుకుంది. అయితే ఇప్పుడు ఈ షోలోకి మరో కొత్త అందం అడుగుపెట్టింది. ఆమె పేరు వర్ష. ఈ కామెడీ షోను రెగ్యులర్ గా చూసేవారికి ఆమె తెలిసే ఉంటుంది. అయితే ఇప్పటి వరకు ఆమె కొన్ని స్కిట్లలో మాత్రమే కనిపిస్తుంది. కానీ తొందర్లోనే అనసూయ, రష్మిలకు స్పాట్ పెట్టేస్తుందని టాక్ వినిపిస్తుంది. అందుకు కారణం ఆమె గ్లామర్. ఇప్పటి వరకు కొన్ని టీవీ సీరియళ్ళలో నటించింది. కానీ ఆమెకు అసలైన గుర్తింపు ఫోటో షూట్ల ద్వారానే వచ్చింది. హాట్ హాట్ షూట్లతో సోషల్ మీడియాలో సందడి చేస్తుంది.

ఈమె గ్లామర్ చూసినవారంతా ఇన్నాళ్లు ఎక్కడున్నావమ్మా అంటూ తెగ ఫీలైపోతున్నారు. అంతే కాదు ఇక్కడ మరో విషయం ఏమిటంటే ఈ అమ్మాయికి యాంకర్ అనసూయకు మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుందట. గతంలో అనసూయ ఓ చిన్నపిల్లాడి చేతిలో ఫోన్ లాక్కుని పగలగొట్టిన విషయం తెలిసిందే.

ఆ సమయంలో అనసూయకు నెటిజన్ల నుంచి భారీగా ట్రోలింగ్ ఎదురైంది. ఈ అమ్మడు కూడా ఓ వీడియోను పోస్ట్ చేసి మరీ అనసూయపై ఫైర్ అయ్యింది. అయితే యిప్పటికైతే ఈ షోలో వీరిద్దరూ ఎదురు పడలేదు. కానీ ఫ్యూచర్ లో వీరిద్దరి మధ్య కాంపిటీషన్ ఏ రేంజ్ లో ఉంటుందో అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

Related News