logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

ఆమెను అగౌరవపరిచే సినిమా కాదు నాది.. ‘అమృత వ్యాఖ్యల’ పై వర్మ..!

మిర్యాలగూడ ప్రణయ్ హత్యోదంతం.. మారుతీరావు ఆత్మహత్య నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ ను నిన్న ఫాథర్స్ డే సందర్భంగా విడుదల చేసాడు. తాజాగా ఈ పోస్టర్ పై అమృత పేరుతో సోషల్ మీడియాలో ట్వీట్లు వైరల్ గా మారాయి.

ఈ సినిమా పోస్టర్ చూసిన తర్వాత ఆత్మహత్య చేసుకోవాలని అనిపించింది. ఒకవైపు భర్తను, తండ్రిని పోగొట్టుకుని ఈ సమాజంలో ఆత్మగౌరవంతో బతుకుతున్న తనపై మళ్ళీ అందరి దృష్టిపడేలా చేస్తున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న కారణంగా ఈరోజు సమాజం దృష్టిలో ఒక దోషిగా నిలబడ్డాను. వర్మ సినిమా ప్రకటించగానే భయంతో వణికిపోయాను. ఇప్పటికే ఈ సమాజం నన్ను నీచంగా చూస్తుందని ఇప్పుడు వర్మ మరోసారి నన్ను బజారున పెట్టేందుకు సిద్దమయ్యాడు. దీనిని ఎదుర్కోవడానికి శక్తి కూడా లేదని, ఏడ్చేందుకు కన్నీళ్లు కూడా రావడం లేదు. కొడుకుతో కలిసి ప్రశాంతంగా బతుకుతున్నాను. ఇప్పుడు వర్మ రూపంలో మరోసారి సమస్య వచ్చిపడింది. వర్మ పై కేసు పెట్టె ఉద్దేశం కూడా లేదు. ఈ నీచ సమాజంలో నువ్వూ ఒకడివే. మహళలను ఎలా గౌరవించాలో నీ తల్లి నీకు నేర్పలేకపోవడం జాలి కలిగిస్తుంది. అందరిని పోగొట్టుకుని ఇప్పటికే ఎన్నో బాధలు అనుభవించిన నాకు ఇదేం లెక్క కాదని చివరగా ‘రెస్ట్ ఇన్ పీస్’ అంటూ అమృత రాసినట్టుగా ఓ వ్యక్తి ట్వీట్ చేసాడు.

దీనిపై రాంగోపాల్ వర్మ స్పందించారు. మర్డర్ సినిమా పోస్టర్ చూసి ఆత్మహత్య చేసుకోవాలని అనిపించిందని చేసిన వ్యాఖ్యలు అమృతవైనా లేక ఇంకో పనిలేని వాడివైనా నేను చెప్పే సమాధానం ఒక్కటే. నా సినిమా వల్ల అనవసరపు ఆందోళనకు గురవుతున్న వారిపట్ల స్పందించాల్సిన బాధ్యత నాకుంది. మర్డర్ సినిమా అనేది ఎన్నో ఏళ్లుగా సమాజంలో జరుగుతున్న మూల కథను నేపథ్యంగా తీసుకుని నేను రాసుకున్నది. ఇది యథార్థ సంఘటనల ఆధారంగా తీసుకున్నానని క్లెయిమ్ చేసానే తప్ప ఇదే నిజమైన స్టోరీ అని ఎక్కడా అనలేదు. ఈ పోస్టర్ తయారీకి స్ఫూర్తిగా నిలిచిన రియల్ ఫోటోలు ఇంటర్నెట్ లో విరివిగా లభ్యమవుతున్నాయి. ఎవరేమి అనుకున్నా నా మనసులో ఉన్న కథ వేరు. నా ఆలోచనలతో సినిమా తెరకెక్కించే పూర్తి స్వేచ్ఛ నాకుంది. అదే విధంగా బాధను అనుభవించిన వారి పట్ల నాకెంతో గౌరవం, సానుభూతి ఉన్నాయి. నా సినిమా ఎవ్వరిని అగౌరవపరచబోదు అని వర్మ తెలిపారు. మరి వర్మ వ్యాఖ్యలపై అమృత ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి

Related News