logo

  BREAKING NEWS

గుడ్ న్యూస్‌: క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్ వచ్చేసింది..!  |   వైఎస్సార్‌, చంద్ర‌బాబు స్నేహ‌బంధంపై సినిమా  |   క‌రోనా ఖతం అయ్యే డేట్ చెప్పిన బిల్ గేట్స్‌  |   నిజంగానే పాపం త‌గిలిన‌ట్లుంది… క‌రోనాతో ఆ ఎస్సై మృతి  |   జూనియ‌ర్ ఎన్టీఆర్ వల్ల కూడా ఆ ప‌ని కాదు.. కొడాని నాని హాట్ కామెంట్స్‌  |   బ్రేకింగ్‌: మాజీ రాష్ట్ర‌ప‌తికి క‌రోనా పాజిటీవ్‌  |   క‌న్న‌డ దంప‌తుల ధైర్యం… పీఓకేలోని శార‌దాపీఠం నుంచి అయోధ్య‌కు ప‌విత్ర మ‌ట్టి  |   పాక్ నుంచి వ‌చ్చిన ఒకే కుటుంబంలో 11 మంది ఆత్మ‌హ‌త్య‌  |   విజ‌య‌వాడ కోవిడ్ సెంట‌ర్‌లో అగ్ని ప్ర‌మాదానికి కార‌ణాలివే..!  |   ప్లాస్మా దానం అంటే ఏమిటి ? ఎవ‌రు చేయాలి ? ఎలా చేయాలి ?  |  

విరసం నేత వరవరరావు ఆరోగ్యం విషమం

విప్లవ రచయితల సంగం(విరసం) నేత వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఈమేరకు మహారాష్ట్ర తలోజా జైలు అధికారులు ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నట్టుగా జైళ్ల శాఖ తెలిపింది. గత కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న వరరరావును అయన వయసు అనారోగ్యం దృష్ట్యా విడుదల చేయాలంటూ అయన కుమార్తెలు మహారాష్ట్ర కోర్టు ప్రధాన న్యాయమూర్తికి, అక్కడి ప్రభుత్వానికి సైతం లేఖ రాసారు.

కాగా మహారాష్ట్రలో చెలరేగిన భీమా కోరేగావ్ అల్లర్లు, మావోయిస్టులతో సంబంధాలు, ప్రధాని మోడీ హత్యకు కుట్ర తదితర అభియోగాలతో వరవరరావును పూణే పోలీసులు 2018లో అరెస్టు చేసారు. అనంతరం ఈ ఏడాది ఫిబ్రవరిలో మహర్షత్ర జైలుకు తరలించారు. ఆయనతో పాటుగా మానవ హక్కుల కార్యకర్తలు వెర్నెన్ గొంజాల్వేన్, అరుణ్ ఫెరీరా, గౌతమ్ నవలఖా, సుధా భరద్వాజ్ లను కూడా అరెస్టు చేసి జైలుకు తరలించారు.

భీమా కోరేగావ్ ఆర్లలో ప్రధాన నిందితుడిగా ఉన్న వరవరరావుకు బెయిల్ మంజారు చేయవద్దని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అభ్యంతరం తెలిపింది. దీంతో ఆయన బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. కాగా ఇదే జైలులో ఇటీవల కరోనా బారిన పడి ఒకరు మృతి చెందిన విషయం మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

Related News