కోలీవుడ్ సీనియర్ నటుడు విజయ కుమార్ కుమార్తె వనిత విజయ్ కుమార్ ఈ మధ్యకాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవలే ఆమె ఓ వ్యక్తిని మూడోపెళ్లి చేసుకోవడం కొన్ని రోజుల వ్యవధిలోనే అతనితో విడిపోవడం సంచలనంగా మారాయి. తాజాగా ఆమె నాలుగోసారి ప్రేమలో ఉన్నానని చెప్పి షాకిచ్చింది.
ఈ వివాదాల నేపథ్యంలో వనిత విజయ్ కుమార్ పై పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు ఎన్నో విమర్శలు చేసారు. కాగా ఆమె మొదటిసారి ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. తనకు తన తల్లిదండ్రులు 18 వ ఏటనే పెళ్లి చేశారని తన సోదరికి కూడా 14 ఏటనే పెళ్లి చేశాయని అందుకే మా ఇద్దరి జీవితాలు నిలబడలేదన్నారు.
ఇక తన మొదటి భర్త నుంచి విడిపోయిన కారణంగా తన కుటుంబం తనను వెలి వేశారని తాను భర్త నుంచి విడిపోవటం వారు పరువు తక్కువగా భావించారని అందుకే ఇప్పటికీ కుటుంబ సభ్యుల నిరాదరణకు గురవుతున్నానన్నారు. అయితే ఇదే ఇంటర్వ్యూలో ఆమె ఓ మెగా హీరో గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తనకు చిన్ననాటి నుంచి మెగాస్టార్ చిరంజీవి కుటుంబంతో చాలా మంచి సంబంధాలు వుండేవన్నారు. వారి ఇంట్లో జరిగే ప్రతి కార్యక్రమానికి మాకు ఆహ్వానం అందేదన్నారు.
అయితే చిరంజీవి గారి ఓ సినిమా ఫంక్షన్ కు వెళ్ళినప్పుడు అల్లు అర్జున్ తనకు లైన్ వేసాడని చెప్పి షాకిచ్చారు. అయితే అప్పుడు అతని వయసు 14 ఏళ్లేనని, తన కన్నా చిన్నవాడని తెలిపింది. అయితే బన్నీ తనను ప్రేమగా చూడటం తాను గమనించానని చెప్పుకొచ్చింది. అప్పటికి అతను బన్నీ అనే విషయం తనకు తెలియదని ఓ సారి బన్నీనే ఆ విషయాన్ని ఫోన్ చేసినప్పుడు గుర్తుచేసాడని తెలిపింది. మెగా హీరోపై వనిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.