logo

  BREAKING NEWS

మహిళలు పీరియడ్స్ సమయంలో వాక్సిన్ తీసుకుంటే ప్రమాదమా?  |   బీపీ, షుగర్ ఉన్నవారు వాక్సిన్ వేసుకోవచ్చా..?  |   కోవిడ్ చికిత్సకు కొత్త మందు.. ఆమోదించిన డీసీజీఐ, ఒక్క డోసుతో కరోనా ఆటకట్టు  |   కరోనా రోగులకు ఆక్సిజన్ స్థాయిలు అమాంతం పెంచే టెక్నిక్.. సూచించిన ఆరోగ్య శాఖ  |   మళ్ళీ తగ్గిన బంగారం ధరలు: 24.04. 2021 బంగారం, వెండి ధరలు  |   మౌత్ వాష్ లతో తగ్గుతున్న కరోనా ముప్పు.. నోట్లోనే వైరస్ ఖతం!  |   రూ. 50 వేల ప్రారంభ వేతనంతో.. డీఎఫ్‌సీసీఐఎల్ ప్రభుత్వ రంగ సంస్థలో భారీగా ఉద్యోగాలు  |   కరోనా రోగులకు శుభవార్త: ఇంట్లోనే ఆక్సిజన్.. ఈ ఒక్కటి ఉంటె చాలు!  |   కరోనా తిప్పలు తీరుస్తున్న ‘తిప్పతీగ’.. మహమ్మారికి దివ్యౌషధం, కరోనా సోకినా ఏమీ చేయలేదట!  |   కరోనా బారిన పడ్డారా? చికిత్స ఎలా? ఆక్సిజన్ ఎక్కడ దొరుకుతుంది? ఆసుపత్రుల వివరాలు అన్నిటికీ ఒకటే యాప్  |  

వందేమాతరం శ్రీనివాస్ కు హత్యా బెదిరింపులు.. రూ. 30 లక్షలకు టోకరా!

ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ కు హత్యా బెదిరింపులు రావడంతో ఆయన జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. తన దగ్గర రూ. 30 లక్షలు తీసుకున్న వ్యక్తులు తిరిగి డబ్బులు అడిగినందుకు తనను చంపుతామని బెదిరిస్తున్నారని అన్నారు.

ఫిలిం నగర్ లో నివాసముండే ఆయనకు రోజూ కేబీఆర్ పార్కులో జాగింగ్ కు వెళ్లే అలవాటు ఉంది. ఈ క్రమంలో కొంత కాలం క్రితం అదే పార్కుకు వచ్చే తిరుపతయ్య అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. మాటల మధ్యలో తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి తనకు డబ్బు అవసరం ఉందని తిరిగి నాలుగు నెలల్లో తిరిగి ఇచ్చేస్తానని నమ్మించాడు.

అతని మాటలు నమ్మిన వందేమాతరం శ్రీనివాస్.. 2018 జూన్ నెలలో కర్నూలు నందికొట్కూరుకు చెందిన గుత్తేదారు రంగస్వామి,తిరుపతయ్యలకు రెండు దఫాలుగా డబ్బులు చెల్లించాడు. అయితే తాను చెప్పిన సమయానికి డబ్బులు ఇప్పటివరకు తిరిగి ఇవ్వలేదు. తన డబ్బులు ఇవ్వాలని అడిగినందుకు చంపుతామని బెదిరిస్తున్నారని పోలీసులకు తెలిపారు. తిరుపతయ్య అతని మామ రంగస్వామిలపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Related News