logo

  BREAKING NEWS

బీజేపీ పార్టీలోకి తెలంగాణ ఫైర్ బ్రాండ్?… క్లారిటీ వచ్చేసింది!  |   మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్: చరిత్ర మరువని రియల్ హీరో స్టోరీ!  |   8 గంట‌ల కంటే ఎక్కువ ప‌ని చేయ‌డం ఎంత డేంజ‌రో తెలుసా ?  |   53 మంది మహిళా ఖైదీలకు సీఎం జగన్ శుభవార్త!  |   బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల: గ్రేటర్ ప్రజలపై వరాల జల్లు!  |   ఎడ‌మ చేతివాటం ఎందుకు వ‌స్తుంది ? వారిలో తేడా ఏముంటుంది ?  |   ఏబీ వెంకటేశ్వర్ రావుకు సుప్రీంలో షాక్..!  |   జ‌గ‌న‌న్న తోడు.. పేద‌ల‌కు రూ.10 వేలు.. ఇలా పొందాలి  |   ‘దమ్ముంటే కూల్చరా’.. అక్బరుద్దీన్ కు బండి సంజయ్ సవాల్!  |   మేయర్ పీఠాన్ని దక్కించుకోగానే వారిని తరిమికొడతాం .. పాతబస్తీపై బండి సంచల వ్యాఖ్యలు  |  

క‌ర్నూలు మ‌హిళ‌కు దొరికిన‌ కోటి రూపా‌యల వ‌జ్రం

క‌ర్నూలు జిల్లాలో ఓ మ‌హిళా రైతుకు జాక్‌పాట్ త‌గిలింది. తుగ్గ‌లి గ్రామంలో వ్య‌వ‌సాయ భూమిలో వేరుశెన‌గ తీస్తున్న ఓ మ‌హిళా రైతుకు విలువైన వ‌జ్రం దొరికింది. ఈ వ‌జ్రాన్ని గుత్తికి చెందిన ఓ బంగారం వ్యాపారి రూ.11 ల‌క్ష‌ల న‌గ‌దు, రెండు తులాల బంగారం ఇచ్చి మ‌హిళ నుంచి కొనుగోలు చేశాడు. అయితే, ఈ వ‌జ్రం విలువ రూ. 1 కోటి వ‌ర‌కు ఉంటుంద‌ని స్థానికంగా ప్ర‌చారం సాగుతోంది.

రాయ‌ల‌సీమ జిల్లాల్లో, ప్ర‌త్యేకించి క‌ర్నూలు, అనంత‌పురంలోని కొన్ని ప్రాంతాల్లో అప్పుడ‌ప్పుడు వ‌జ్రాలు దొరుకుతుంటాయి. నిజానికి వ‌జ్రాల కోసం చాలా మంది ప‌నులు మానుకొని వెతుకుతుంటారు. వ‌ర్షాలు ప‌డ్డ‌ప్పుడు వ‌జ్రాల వేట ఎక్కువ‌గా కొన‌సాగుతుంది. కానీ, ఈ మ‌హిళ వెత‌క‌కుండానే త‌న పొలం ప‌నులు చేసుకుంటుండ‌గానే విలువైన వ‌జ్రం ల‌భించింది.

Related News