logo

  BREAKING NEWS

ఓటీటీలో రిలీజైన కేజీఎఫ్: చాప్ట‌ర్‌-2..! కానీ షాకిచ్చిన అమెజాన్ ప్రైమ్‌  |   టాయిలెట్‌లో కెమెరా.. హోంమంత్రికి ఫిర్యాదు  |   కాబోయే భ‌ర్త మృతి.. ఆ యువ‌తి చేసిన ప‌నికి క‌న్నీళ్లు ఆగ‌వు  |   స‌లార్ సినిమాపై కిక్కిచ్చే వార్త‌  |   మ‌హేష్ – రాజ‌మౌళి సినిమాపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన విజ‌యేంద్ర ప్ర‌సాద్‌  |   వంద‌ల ఎక‌రాల భూమి ఉన్న కుటుంబంలో కేసీఆర్ పుట్టారు  |   2022 – 23కు కేంద్రీయ విద్యాల‌య అడ్మిష‌న్లు ప్రారంభం.. పూర్తి వివ‌రాలు  |   నిరుద్యోగుల‌కు భారీ శుభ‌వార్త‌.. రైల్వేలో 2,65,547 ఖాళీలు  |   మ‌రో కొత్త ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్న జ‌గ‌న్‌.. దేశంలోనే మొద‌టిసారి  |   అండ‌మాన్ ఎన్నిక‌ల్లో మ‌రోసారి స‌త్తా చాటేందుకు చంద్ర‌బాబు స్కెచ్‌  |  

‘వకీల్ సాబ్’ రివ్యూ: సినిమాలో ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఇవే

మూడేళ్ళ గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 2016 లో అమితాబ్ బచ్చన్ నటించిన ‘పింక్’ సినిమాకు రీమేక్ గా వకీల్ సాబ్ ను తెరకెక్కించారు. ఇప్పటికే పలు భాషల్లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఒరిజినల్ కథకు ఎలాంటి డ్యామేజ్ చేయకుండా కొన్ని మార్పులు, చేర్పులతో ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు దర్శకుడు వేణు శ్రీరామ్. మరి ఈ సినిమా పవన్ అభిమానులతో పాటుగా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో రివ్యూలో తెలుసుకుందాం..

కథ:

ముందుగా కథ లోకి వెళితే.. సామాన్యులకు న్యాయం చేయాలనే ఉదేశ్యంతో సత్యదేవ్(పవన్ కళ్యాణ్) లాయర్ వృత్తిని ఎంచుకుంటాడు. అదే సమయంలో శృతి హాసన్ తో ప్రేమలో పడతాడు. అయితే అనుకోని కారణాల వల్ల సత్యదేవ్ లాయర్ వృత్తిని వదులుకుంటారు. అతని జీవితంలో జరిగిన కొన్ని పరిణామాలు అతన్ని తాగుబోతుగా మారుస్తాయి. తాను ఉంటున్న ఏరియాలో ముగ్గురు అమ్మాయిలు సత్యదేవ్ సహాయం కోరి వస్తారు. తమను లైంగికంగా లొంగదీసుకోబోయిన ఎంపీ కొడుకుని కొట్టి పారిపోయిన కేసులో నివేతను జైల్లో పెడతారు. ఈ కేసు విషయంలో అనన్య, అంజలి, నివేత లకు సత్యదేవ్ కొన్ని న్యాయపరమైన సూచనలు ఇస్తాడు. సత్యదేవ్ ఈ కేసులో ఇన్వాల్వ్ అవుతున్నాడన్న విషయం తెలుసుకున్న ఆ ఎంపీ సత్యదేవ్ ను బెదిరించే ప్రయత్నం చేస్తాడు. ఆ సీన్ తో మనసుమార్చుకున్న సత్యదేవ్ ఈ కేసును టేకప్ చేయడానికి నిర్ణయించుకుంటాడు. అందుకోసం సీనియర్ లాయర్ అయిన నంద(ప్రకాష్ రాజ్)తో కోర్టులో తలపడతాడు. చివరకు ఈ కేసు నుంచి తన క్లైంట్స్ ను సత్యదేవ్ ఎలా కాపాడాడు? అతని గతం ఏమిటి? అంతలా ప్రేమించే లాయర్ వృత్తిని ఎందుకు వదిలేసాడు? అనే విషయాలే సినిమాలో మిగిలిన కథ.

విశ్లేషణ:

పవన్ కళ్యాణ్ కెరీర్ లో వకీల్ సాబ్ ఓ ప్రత్యేకమైన సినిమాగా నిలుస్తుందని చెప్పడంలో సందేహం లేదు. పవన్ పరిణితి చెందిన నటనతో సినిమాను తన భుజాలకెత్తుకున్నాడు. మూడు డిఫరెంట్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తాడు. ఒరిజినల్ కథను ఏమాత్రం చెడగొట్టకుండా అటు పవన్ అభిమానుల అంచనాలకు తగ్గకుండా సినిమా కథను రాసుకున్న వేణు శ్రీరామ్ ను అభినందించి తీరాల్సిందే. ముఖ్యంగా మల్టిప్లెక్స్ ఆడియెన్ కు మాత్రమే పరిమితమైన ఈ స్టోరీ లైన్ ను మాస్ ప్రేక్షకులకు కూడా నచ్చేట్టుగా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. పవన్ తర్వాత ప్రేక్ష రాజ్ నటన అలరిస్తుంది. సినిమా మొదలైన దాదాపు పావు గంట తర్వాత పవన్ ఎంట్రీ ఉంటుంది. ఇక పవన్ తెరపై లేని సమయంలో అంజలి, నివేత, అనన్య ల నటన ఆ లోటు తీరుస్తుంది. నివేతకు మరోసారి మంచి పాత్ర దక్కింది. కొన్ని సన్నివేశాల్లో ఆమె నటనను అభినందించకుండా ఉండలేము. ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఊహించగలిగిందే కావడంతో శృతి హాసన్ పాత్రకు అంత స్కోప్ దక్కలేదు. ఇక అసలు విషయం సెకండ్ హాఫ్ లోనే మొదలవుతుంది. అన్యాయంగా కేసులో ఇరికిన ముగ్గురు ఆడపిల్లల తరపున హీరో కేసు టేకప్ చేయడం నుంచి సినిమా మరో స్థాయికి చేరుకుంటుంది. కోర్టు సీన్లు, అక్కడ వచ్చే సన్నివేశాలు అన్నీ చక్కగా కుదిరాయి. యాక్షన్ సీన్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. కథకు అనుగుణంగా చేసిన మార్పులే సినిమాకు కీలకంగా నిలుస్తాయి. ఇప్పటికే ఈ సినిమా చుసిన వారికి సైతం బోర్ కొట్టకుండా సినిమాను తెరకెక్కించారు. అయితే పింక్ సినిమాను ఇష్టపడిన వారికి మాత్రం కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ను బలవంతంగా జొప్పించారనే ఫీలింగ్ కలుగుతుంది. కోర్టు సన్నివేశాల్లో వచ్చే కొన్ని డైలాగులు సహజత్వానికి దూరంగా ఉన్నట్టుగా అనిపిస్తాయి.

ప్లస్ పాయింట్స్:

వకీల్ సాబ్ సినిమాలో పవన్ నటన, థమన్ మ్యూజిక్, కోర్టు సీన్స్, నివేత నటన యాక్షన్ సీన్స్ ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి.

మైనస్ పాయింట్స్ :

ఫ్లాష్ బ్యాక్ సీన్స్, ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ లాంటివి మైనస్ పాయింట్స్ గా నిలుస్తాయి.

రేటింగ్:

ఫైనల్ గా వకీల్ సాబ్ కు 3/5 రేటింగ్ ఇవ్వచ్చు.

 

 

Related News