logo

  BREAKING NEWS

మీ పిల్ల‌ల‌కు బండిస్తున్నారా ? జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి  |   ఆరియానా గ్లోరీకి బంప‌ర్ ఆఫ‌ర్‌.. మెగా హీరో సినిమాలో ల‌క్కీ ఛాన్స్  |   ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆ నోటిఫికేషన్ రద్దు!  |   బ్రేకింగ్: తాజ్ మహల్ కు బాంబు బెదిరింపు..!  |   మున్సిప‌ల్ ఎన్నిక‌లపై సీక్రెట్ స‌ర్వే.. రిజ‌ల్ట్ చూసి షాకైన జ‌గ‌న్‌  |   బంగారం కొనేవారికి బ్యాడ్‌ న్యూస్.. పెరిగిన బంగారం ధ‌ర‌లు  |   బ్రేకింగ్: నిమ్మగడ్డ వివాదాస్పద నిర్ణయానికి హైకోర్టు బ్రేకులు.. భారీ ఎదురుదెబ్బ!  |   ఆనాడు జగన్ ను అడ్డుకున్నారు.. బాబుపై ఏపీ మంత్రి ధ్వజం  |   మంత్రి కేటీఆర్ కు సవాల్.. ఓయూ క్యాంపస్ దగ్గర ఉద్రిక్తత!  |   హైటెన్షన్: చంద్రబాబుకు షాకిచ్చిన పోలీసులు.. ఎయిర్పోర్టులో బైఠాయింపు!  |  

వ‌కీల్ సాబ్ మ‌రో రికార్డు.. షూటింగ్ కాక‌ముందే రూ.15 కోట్లు వ‌చ్చేశాయి

రాజ‌కీయాల కార‌ణంగా సినిమాలకు కొంచెం బ్రేక్ ఇచ్చి మ‌ళ్లీ రీఎంట్రీ ఇస్తున్న ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న వ‌కీల్ సాబ్ సినిమాపై ఇప్పుడు అభిమానుల‌తో పాటు మొత్తం టాలీవుడ్ అంతా ఆస‌క్తి చూపిస్తోంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఉన్న క్రేజే ఇందుకు కార‌ణం. దిల్ రాజు నిర్మాత‌గా వేణుశ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌కీల్ సాబ్ తెర‌కెక్కుతోంది. బాలీవుడ్‌లో సూప‌ర్ హిట్ అయిన పింక్ సినిమాకు ఇది రీమేక్‌.

తెలుగులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తుండ‌టంతో ఈ సినిమా ప‌క్కా సూప‌ర్ హిట్ అవుతుంద‌నే అంచ‌నాలు ఉన్నాయి. అందుకే దిల్ రాజు ఈ సినిమాకు భారీగానే ఖ‌ర్చు పెడుతున్నారు. మొత్తం సినిమాకు అయ్యే ఖ‌ర్చులో స‌గం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు రెమ్యూన‌రేష‌న్‌గా ఇస్తున్నార‌ట‌. ప‌వ‌న్ రెమ్యున‌రేష‌న్ సుమారు 40 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌నే టాక్ కూడా వినిపిస్తోంది. కేవ‌లం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను న‌మ్మి భారీగా ఈ సినిమాకు బ‌డ్జెట్ కేటాయించాడు దిల్ రాజు.

సినిమాల‌ను అంచ‌నా వేయ‌డంలో దిల్ రాజు దిట్ట‌. ఈ విష‌యం వ‌కీల్ సాబ్‌తో మ‌రోసారి నిరూపిత‌మైంది. ఇందుకు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోయిన ధ‌ర మంచి ఉదాహ‌ర‌ణ‌. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ రూ.15 కోట్లు ప‌లికింద‌ని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ద‌శ‌లోనే జెమిని టీవీ వారు శాటిలైట్ రైట్స్ కొనేందుకు ప్ర‌య‌త్నించారు. ఇప్పుడు జీతెలుగు వీరికి పోటీగా వ‌చ్చింది. చివ‌ర‌కు జీ తెలుగు వారు రూ.15 కోట్ల‌కు శాటిలైట్ రైట్స్ ద‌క్కించుకున్నార‌ట‌.

ఇక్కడే ఒక చిన్న ఒప్పందం కూడా ఉంద‌ని తెలుస్తోంది. సినిమా థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయ‌గానే ఓటీటీలో రిలీజ్ చేయ‌వ‌ద్ద‌ని, ముందుగా టీవీలో టెలీకాస్ట్ అయిన త‌ర్వాత‌నే ఓటీటీలో రిలీజ్ చేయాల‌ని శాటిలైట్ హ‌క్కులు ద‌క్కించుకున్న జీతెలుగు కోరింద‌ని చెబుతున్నారు. ముందుగా ఓటీటీలో సినిమా రిలీజ్ అయితే ఇళ్ల‌లో కుటుంబ‌స‌భ్యులు అంతా క‌లిసి యాడ్స్ లేకుండా, హెచ్‌డీ క్వాలిటీలో చూసేస్తున్నారు. ఆ త‌ర్వాత టీవీలో సినిమా వేసినా ఆశించినంత టీఆర్పీ రావ‌డం లేదు. అందుకే ఈ కండీష‌న్ పెట్టార‌ని తెలుస్తోంది.

ఇక‌, వ‌కీల్ సాబ్ డిజిట‌ల్ రైట్స్‌ను ద‌క్కించుకునేందుకు కూడా ఓటీటీ సంస్థ‌ల మ‌ధ్య భారీ పోటీ నెల‌కొంది. అమెజాన్ ప్రైమ్‌తో పాటు మ‌రో రెండు ఓటీటీ సంస్థ‌లు కూడా వ‌కీల్‌సాబ్ సినిమాను ద‌క్కించుకునేందుకు ఆస‌క్తిగా ఉన్నాయి. వ‌కీల్ సాబ్ డిజిట‌ల్ రైట్స్‌కు సుమారు రూ.15 – 20 కోట్లు ప‌లికే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు. కాగా, ఇప్ప‌టికే రిలీజైన వ‌కీల్ సాబ్ టీజ‌ర్ యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది.

Related News