logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

హిందుస్థాన్ షిప్ యార్డు ప్రమాదంపై సీఎం కీలక ఆదేశాలు

విశాఖను వరుస ప్రమాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవల గ్యాస్ లీకేజి ఘటన మరువక ముందే హిందుస్థాన్ షిప్ యార్డులో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. షిప్ యార్డయిలో భారీ క్రేన్ కుప్పకూలడంతో 11 మంది మృతి చెందారు. రోజు వారీ విధుల్లో భాగంగా క్రేన్ తో లోడింగ్ పనులను పర్యవేక్షిస్తున్న సమయంలో ఒక్కసారిగా క్రేన్ విరిగి పడి ఈ ప్రమాదం సంభవించినట్టు తెలుస్తుంది.

ఈ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. ప్రమాద ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు తక్షణమే మెరుగైన సహాయం అందించాలని విశాఖ జిల్లా కలెక్టర్‌, విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ను సీఎం జగన్ ఆదేశించారు. కాగా ప్రమాదం సంభవించిన సమయంలో అక్కడ 15 నుంచి 20 మంది కార్మికులు పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది.

సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన ప్రమాద స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భారీ క్రేన్ కావడంతో దానిని తొలగించేందుకు మరికొంత సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. కాగా ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

ఈ ఘటనలో మృతుల సంఖ్య 11 కు చేరింది. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. కాగా భద్రతా ప్రమాణాలను పాటించే హిందుస్థాన్ వంటి కంపెనీలో ప్రమాదం సంభవించడం ఆందోళన కలిగిస్తుంది. ఈ షిప్ యార్డులో ఇలాంటి ప్రమాదం జరగడం ఇదే తొలిసారి అని 30 ఏళ్లుగా అక్కడ పని చేస్తున్న కార్మికులు అభిప్రాయపడుతున్నారు.

Related News