logo

  BREAKING NEWS

బ‌జాజ్ చేత‌క్ మ‌ళ్లీ వ‌చ్చేసింది.. ధ‌ర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు  |   హ‌మ్మ‌య్య‌… ఆ వ్యాక్సిన్‌లు కూడా వ‌చ్చేస్తున్నాయి  |   మీ ఫేస్ బుక్ ఖాతా హ్యాక్ అయ్యిందా? మీ డేటా ఎక్కడైనా లీక్ అయ్యిందా? ఇలా తెలుసుకోండి  |   తగ్గిన బంగారం ధరలు 14.04. 2021 నాటి బంగారం, వెండి ధరలు  |   మళ్ళీ పెరిగిన బంగారం ధరలు 13.04.2021 నాటి బంగారం, వెండి ధరలు  |   శుభవార్త: భారత్ లో మరో వాక్సిన్ కు గ్రీన్ సిగ్నల్!  |   కరోనా సెకండ్ వేవ్: ఎక్కువ మందిలో బయటపడుతున్న లక్షణం ఇదే  |   బ‌ట్ట‌లు లేకుండా అమ్మాయిలు వీడియో కాల్ చేస్తారు టెంప్ట్ అయితే మీ ప‌ని ఖ‌తం  |   హలీమ్ తింటే బరువు పెరుగుతారా?  |   ఆ నాలుగు ప్రాంతాల్లోనే కుంభమేళా ఎందుకు? కోట్ల ఖర్చుతో ఎందుకు నిర్వహిస్తారు?  |  

ఆ మెగా యంగ్ హీరోకి బట్టతల.. ఖంగుతున్న అభిమానులు!

ఈరోజుల్లో బట్టతల అనేది చాలా సాధారణ విషయంగా మారిపోయిది. సామాన్యులు మొదలు సినీ సెలబ్రిటీల వరకు చాలా మంది ఈ సమస్య బారినపడిన వారే. కొంతమంది ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తుంటారు. మరికొందరు హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ లాంటి కాస్మెటిక్ చికిత్సలు చేయించుకుంటారు. ఇప్పటికే కొంత మంది స్టార్ హీరోలు విగ్గులతోనే దర్శనిమిస్తుంటారు. కానీ ఆ విషయం బయట చాలా మందికి తెలియదు. కానీ ఇప్పుడు ఓ యంగ్ హీరో చేసిన పనికి అభిమానులతో పాటుగా టాలీవుడ్ కూడా ఆశ్చర్యపోతుంది.

‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు వైష్ణవ్ తేజ్. మొదటి సినిమాతోనే క్లిష్టమైన పాత్రను ఎంచుకుని ఏ హీరో చేయని ప్రయోగం చేసి శభాష్ అనిపించుకున్నాడు. కలెక్షన్ల పరంగా కూడా రికార్డు సృష్టించాడు. తాజాగా వైష్ణవ్ తేజ్ కు సంబందించిన వీడియో ఒకటి మెగా అభిమానులు షాకిచ్చింది.

ఈ హీరో సోషల్ మీడియాలో తాను చేసిన ఓ మ్యాజిక్ ట్రిక్ వీడియోను షేర్ చేసాడు. టేబుల్ పైన ఉన్న వైన్ బాటిల్ ను దూరం నుంచే తన చేతులను కదిలిస్తూ దగ్గరకు లాక్కుని మ్యాజిక్ చేసాడు. అయితే ఈ హీరో మ్యాజిక్ కన్నా ఈ వీడియోలో అతని లుక్ చూసి నెటిజన్లు కంగుతున్నారు. అందులో వైష్ణవ్ తేజ్ బట్టతలతో కనిపిస్తున్నాడు. ఉప్పెన సినిమాలో మాత్రం తన క్యారెక్టర్ కు సూటయ్యే షార్ట్ హెయిర్ స్టైల్ తో మ్యాన్లీ గా కనిపించాడు. అయితే ఇప్పుడు ఈ వీడియో చుసిన వారంతా ఏంటీ.. ఈ హీరోకు బట్టతలా? అంటూ ఆశ్చర్యపోతున్నారు.

ఉప్పెన సినిమాలో విగ్గు పెట్టుకుని కవర్ చేశాడా అని ట్రోల్స్ చేస్తున్నారు. నిజానికి ఈ వీడియో ఇప్పటిది కాదు. నాలుగేళ్ళ క్రితం వీడియోను వైష్ణవ్ తేజ్ షేర్ చేసాడు. అప్పుడు బట్టతల ఉన్నా హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ తో దానిని సరి చేసుకుని ఉండవచ్చని అనుకుంటున్నారు. ఏది ఏమైనా సినీ పరిశ్రమ అంటేనే గ్లామర్ ఫీల్డ్. అలాంటిది ఇలా బట్టతలతో వైష్ణవ్ తేజ్ అభిమానుల ముందుకు రావడం సాహసమనే చెప్పాలి. అందుకు కొందరు నెటిజన్లు ఈ హీరో ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. మరో దర్శకుడు సుకుమార్ తో కూడా అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం.

Related News