logo

  BREAKING NEWS

మీనా భ‌ర్త మృతికి అస‌లు కార‌ణం ఇదే  |   మీ సిబిల్ స్కోర్ ఈజీగా పెంచుకోండి ఇలా  |   అంబాసిడ‌ర్ మ‌ళ్లీ వ‌స్తోంది.. కొత్త లుక్ సూప‌ర్‌  |   తిరుప‌తి రైల్వే స్టేష‌న్‌పై వివాదం.. డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ ట్వీట్‌  |   వామ్మో.. ఓలా బైక్ ఎలా విరిగిపోయిందో చూడండి  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు అందుకే నా మీద కోపం.. షాకింగ్ విష‌యం చెప్పిన‌ రాజ‌శేఖ‌ర్‌  |   ఆంటీతో యువ‌కుడి వివాహేత‌ర సంబంధం.. చివ‌ర‌కు విషాదాంతం  |   కేంద్రం బాట‌లో రాష్ట్రాలు.. భారీగా త‌గ్గుతున్న పెట్రోల్ ధ‌ర‌లు  |   దావోస్‌కు వెళ్లిన టీడీపీ ఎంపీ.. కేంద్ర‌మంత్రితో ఫోటో  |   రేవంత్ రెడ్డిని డిస్‌మిస్ చేయండి.. రాహుల్ గాంధీకి బండ్ల గ‌ణేష్ ఫిర్యాదు  |  

కేంద్రం గుడ్ న్యూస్.. ఇకపై వారికి కూడా వాక్సిన్!

దేశవ్యాప్తంగా కరోనా మరోసారి విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి గతంలో తీసుకున్న చర్యలనే మళ్ళీ అమలు చేసేందుకు కేంద్రం సిద్దమవుతుంది. మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఇకపై 45 ఏండ్లు, ఆ పైబడిన వయసు వారిని కూడా చేరుస్తున్నట్టుగా నిర్ణయం తీసుకుంది. కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో కేంద్రం ప్రకటించిన నిర్ణయం భారీ ఊరటనిస్తోంది.

ఈ విషయాన్ని కేంద్ర,మంత్రి ప్రకాష్ జవదేకర్ వెల్లడించారు. కరోనా టాస్క్ ఫోర్స్ నిపుణులు, నిపుణులు చేసిన సూచనల మేరకు కేంద్రం ఈ నిరయం తీసుకున్నటుగా కేంద్ర మంత్రి వెల్లడించారు. ఈ మేరకు ఏప్రిల్ 1 వ తేదీ నుంచి 45 సంవత్సరాలు, ఆ పైబడిన వారు కూడా అందుబాటులో ఉన్న సెంటర్లలో వాక్సిన్ తీసుకోవచ్చు. ఇప్పటివరకు మొదటి దశ ప్రక్రియలో భాగంగా పారిశుధ్య కార్మికులు, వైద్య సిబ్బందికి టీకాలు ఇచ్చారు.

రెండు విడతలో 60 ఏండ్లు దాటిన వారికి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి టీకాలు ఇస్తున్నారు.గడిచిన కొన్ని రోజులుగా పలు రాష్ట్రాలలో అత్యధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతుండటంతో ఆయా రాష్ట్రాలు 45 నుంచి 59 సంవత్సరాల వారు వారికి కూడా వాక్సిన్ అందించాలని కేంద్రాన్ని కోరాయి. రాష్ట్రాల కోరిక మేరకు కేంద్రం తాజాగా ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. ఇక ఏప్రిల్ 1వ తేదీ నుంచి 45 సంవత్సరాలు, ఆ పైబడిన వారు కూడా వాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

Related News
%d bloggers like this: