logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

ఏ వయసు వారికి టీకా వేస్తారు? సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

భారత్ లో జనవరి 16వ తేదీన వ్యాక్సినేషన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వాక్సిన్ పై చర్చ జరుగుతుంది. ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ ఇదే రోజున వ్యాక్సినేషన్ ను ప్రారంభించనుంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే కరోనా టీకాను మొదట ఆరోగ్య సేవల సిబ్బంది, ఫ్రంట్ లైన్ వారియర్స్ కు వేయనున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా వీరి సంఖ్య దాదాపు మూడు కోట్లుగా ఉంది. వారి తర్వాత 50 ఏళ్ల వయసు దాటిన వారికి, 50 ఏళ్ల లోపు వయసు ఉండి ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న 27 కోట్ల మందికి వాక్సిన్ వేయనున్నట్టుగా ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో సాధారణ ప్రజలకు టీకా ఎప్పుడు వేస్తారు? వాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి? కరోనా రోగులకు, ఇప్పటికే కరోనా సోకి కోలుకున్న వారికి కూడా వాక్సిన్ వేస్తారా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి.

మూడు దశలుగా టీకా పంపిణీ..

కాగా వైద్య నిపుణులు పేర్కొన్న వివరాల ప్రకారం.. ముందుగా మొదటి దశ టీకా పంపిణీలో భాగంగా వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య, పోలీసు సిబ్బందికి అందిస్తారు. రెండవ దశలో 50 ఏండ్లు దాటిన వారికి అలాగే 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు ఉండి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి టీకా ఇస్తారు. చివరి దశలో మాత్రమే సాధారణ ప్రజలకు టీకాను అందిస్తారు అని వెల్లడిస్తున్నారు. 18 ఏళ్ల లోపు వయసున్న వారిపై కరోనా ప్రభావం తక్కువగా ఉంటుంది కాబట్టి వారికి టీకా అవసరం ఉండదు. ఆపైన వయసు వారంతా వాక్సిన్ తీసుకోవచ్చు.

కరోనా నుంచి కోలుకున్న వారికీ టీకా.. ?

ఇక కరోనా సోకి కోలుకున్న వారి విషయానికొస్తే వారికి కోలుకున్న తర్వాత 90 రోజుల పాటు వాక్సిన్ అవసరం ఉండదు. అప్పటికే వారి శరీరంలో యాంటీ బాడీలు ఉత్పత్తి అయ్యి ఉంటాయి కాబట్టి వాక్సిన్ అవసరం లేకుండానే వైరస్ నుంచి రక్షణ లభిస్తుంది. ఒక వేళ కరోనా సోకిన వారు వాక్సిన్ వేయించుకోవాలి అనుకుంటే కోలుకున్న ఎనిమిది వారాల తర్వాతనే వాక్సిన్ వేస్తారు.

సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి?

కరోనా వాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ పై ప్రజల్లో ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం భారత ప్రభుత్వం ఆమోదం పొందిన కోవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు అన్ని దశల ప్రయోగాలు పూర్తి చేసుకుని అందుబాటులోకి వచ్చినవే. అన్ని కోణాల్లో పూర్తిగా విశ్లేషించిన తర్వాతనే డ్రగ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా వాక్సిన్లకు అనుమతులు ఇచ్చింది. కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ పై ఆందోలన అవసరం లేదని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

వీరికి టీకా వేయరు.. !

ఇక టీకా వేయని వారు ఎవరంటే.. ఎవరైతే తీవ్ర జ్వరంతో బాధపడుతుంటే వారికి టీకా వేయరు. అలాగే అవయవ మార్పిడి చేసుకున్న వారికి కూడా టీకా వేయరు. కరోనా సోకిన వారికి ముందుగా టీకా వేస్తారని కొందరిలో ఒక అపోహ ఉంది. నిజానికి వాక్సిన్ అనేది కరోనా సోకకుండా ముందు జాగ్రత్తగా వేసుకునేది. కాబట్టి అప్పటికే కరోనా సోకిన రోగులకు కూడా టీకా వేయరు. ఎవరైతే టీకా వేయించుకుంటున్నారో వారు ముందుగానే వారి ఆరోగ్య పరిస్థితి గురించిన పూర్తి సమాచారాన్ని వైద్యులకు అందించాల్సి ఉంటుంది.

Related News