logo

  BREAKING NEWS

ప్రపంచాన్ని వణికిస్తున్న ‘బుబోనిక్ ప్లేగు’.. ఇది కరోనా కన్నా డేంజర్!  |   గాల్వన్ లోయ నుంచి చైనా వెనక్కి.. డ్రాగన్ ను నమ్మలేమంటున్న భారత్  |   చైనాతో యుద్ధం.. భారత్ కు మద్దతుగా నిలుస్తున్న దేశాలు ఇవే!  |   హైదరాబాద్ లో మళ్ళీ లాక్ డౌన్ లేనట్టే.. కారణం ఇదే!  |   బ్రేకింగ్‌: తెలంగాణ‌లో ఇవాళ భారీగా న‌మోదైన క‌రోనా కేసులు  |   బ్రేకింగ్‌: రైతుల కోసం జ‌గ‌న్ మ‌రో అద్భుత‌మైన ప‌థ‌కం  |   సోష‌ల్ మీడియాలో క‌నిపించే ఈ ఆఫ్రిక‌న్ బుడ్డోడి అస‌లు క‌థ ఇది  |   కరోనా రికార్డు.. 24 గంటల్లో 20,903 కేసులు.. 18 వేల మరణాలు!  |   లఢక్ కు చేరుకున్న ప్రధాని మోడీ.. దేనికి సంకేతం?  |   తెలంగాణలో లాక్ డౌన్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ..!  |  

రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన కొనసాగుతుంది: ఉత్తమ్

తెలంగాణలో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల్ని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు దీక్ష కు సిద్ధమైన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున కాంగ్రెస్ నేతల జల దీక్షను అడ్డుకోవడానికి వీరందరిని ఈరోజు తెల్లవారుజాము నుండే పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు. నేతలెవరూ ఇంటి నుండి బయటకు రాకుండా పోలీసులు పహారా కాస్తున్నారు.

పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ని కూడా పోలీసులు నిర్బంధంలో ఉంచారు. ఈ అంశం పై మాట్లాడిన ఉత్తమ్ తెలంగాణ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. ప్రభుత్వం నియంత పోకడకు ఇది నిదర్శనమన్నారు. ఇదొక అప్రజస్వామిక చర్యగా పేర్కొన్నారు. వెంటనే తమ కాంగ్రెస్ నేతల ఇళ్ల ముందు నుండి పోలీసులను వెనక్కి పంపాలని అయన డిమాండ్ చేసారు.

శాంతియుతంగా తాము చేపట్టిన కార్యక్రమాన్ని అడ్డుకోవడంపై ఆయన మండిపడ్డారు. మాట్లాడితేనే అరెస్టులు చేయించడం అనేది ఆవిర్భావ దినోత్సవం నాడు తమ హక్కులను కాలరాయడమే అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక నియంత, అసమర్థత పాలన కొనసాగుతుందని ధ్వజమెత్తారు. ఇందుకేనా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది అని ఉత్తమ్ ప్రభుత్వాన్ని నిలదీశారు.

Related News