ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అకస్మాత్తుగా సంభవించిన వరదలకు 150 మంది గల్లంతయ్యారు దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనపై ప్రధాని మోదీ దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. మంచు చరియలు విరిగిపడటంతో నదీ ప్రవాహం పోటెత్తింది. వరదల ధాటికి చమోలీ జిల్లా రైనీ తపోవన్ వద్ద పవర్ ప్రాజెక్ట్‌లోకి భారీగా నీరు చేరింది.
అక్కడున్న వంతెన వరదల్లో కొట్టుకుపోయింది. విద్యుత్ కేంద్రాల్లో పని చేస్తున్న 150 మంది కార్మికులు వరద నీటిలో గల్లంతయ్యారు. మెరుపు వరదలతో అప్రమత్తమైన ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపింది. వారితో పాటుగా ఇండో టిబెటిన్ సరిహద్దు పోలీసులు కూడా సహాయక చర్యలు చేపడుతున్నారు. ఉదృతి పెరిగే అవకాశం ఉండటంతో నదీ తీర ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేసారు అధికారులు.