logo

  BREAKING NEWS

రేవంత్ పై వ్యాఖ్యలు.. ఉత్తమ్ కుమార్ రెడ్డి వార్నింగ్

తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. గత కొంతకాలంగా పీసీసీ మార్పుపై పార్టీలో చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ విషయంపై స్పందించిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి పీసీసీ పదవీ నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మార్చాల్సిన అవరం ఏమిటని ప్రశ్నించారు. ఈ విషయం పై తాను రాహుల్ గాంధీకి లేఖ రాస్తానన్నారు.

ఒకవేళ మార్చవలసి వస్తే ఆ రేసులో తాను కూడా ఉంటానని స్పష్టం చేసారు. మరోవైపు తన అభిప్రాయం తీసుకోకుండా రేవంత్ రెడ్డి కి పీసీసీ అప్పగిస్తే వ్యతిరేకిస్తానని, తన రాజకీయం తనకు ఉంటుందని స్పష్టం చేసారు. పీసీసీ మార్పుపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ స్పందించారు. ఈ సమయంలో పీసీసీ మార్పుపై మాట్లాడవలసిన అవసరం ఏమిటని ప్రశ్నించారు.

మరోసారి ఈ విషయంపై చర్చించవద్దని మందలించినట్టు తెలుస్తుంది. ఇక టీపీసీసీ మార్పుపై అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందని ఉత్తమ్ తెలిపారు. అప్పటివరకు దీనిపై చర్చ తగదన్నారు. అయితే తాను ఏ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేయవలసి వచ్చిందో ఉత్తమ్ కుమార్ కు వివరిస్తానని మరోసారి ఈ విషయం పై మాట్లాడనని జగ్గారెడ్డి ఉత్తమ్ కు వివరణ ఇచ్చారు. .

Related News