logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

మంత్రి కేటీఆర్ పై పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ ప్రశంసలు

వారిద్దరూ రాజకీయ ప్రత్యర్థులు. నిత్యం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు ఈరోజు ఒకే వేదికపై కలిశారు. వేదికలపై విమర్శనాస్త్రాలు గుప్పించే వీరు అందుకు భిన్నంగా ఒకరికిపై ఒకరు పొగడ్తల వర్షం కురిపించారు. తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డ్డి ప్రశంసలు కురిపించుకుని ఆశ్చర్యపరిచారు.

మంత్రి కేటీఆర్ ఈరోజు హుజూర్ నగర్ నియోజకవర్గంలో పర్యటించారు. అక్కడి ఎండీవో కార్యాలయంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉత్తమకుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. అనంతరం ఇద్దరు బహిరంగ సమావేశానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కేటీఆర్ డైనమిక్ లీడర్ అంటూ పొగిడారు. అదేవిధంగా టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఐదేళ్లను పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కు కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఈ చర్యతో సభా ప్రాంగణం చప్పట్లతో మారుమోగింది.

Related News