logo

  BREAKING NEWS

8 గంట‌ల కంటే ఎక్కువ ప‌ని చేయ‌డం ఎంత డేంజ‌రో తెలుసా ?  |   53 మంది మహిళా ఖైదీలకు సీఎం జగన్ శుభవార్త!  |   బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల: గ్రేటర్ ప్రజలపై వరాల జల్లు!  |   ఎడ‌మ చేతివాటం ఎందుకు వ‌స్తుంది ? వారిలో తేడా ఏముంటుంది ?  |   ఏబీ వెంకటేశ్వర్ రావుకు సుప్రీంలో షాక్..!  |   జ‌గ‌న‌న్న తోడు.. పేద‌ల‌కు రూ.10 వేలు.. ఇలా పొందాలి  |   ‘దమ్ముంటే కూల్చరా’.. అక్బరుద్దీన్ కు బండి సంజయ్ సవాల్!  |   మేయర్ పీఠాన్ని దక్కించుకోగానే వారిని తరిమికొడతాం .. పాతబస్తీపై బండి సంచల వ్యాఖ్యలు  |   కరోనా సెకండ్ వేవ్: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!  |   మహిళల భద్రతకు ‘అభయం’ యాప్.. ఎలా పనిచేస్తుంది? ప్రత్యేకతలేమిటి?  |  

ప్రజలారా.. ఆ వార్తలు నమ్మొద్దు.. దుబ్బాక ఓటర్లకు ఉత్తమ్ విజ్ఞప్తి

ఓ న్యూస్ ఛానెల్ లోగోను ఉపయోగించి దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరారని సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారం అవుతున్న సంగతి తెలిసిందే. సదరు న్యూస్ ఛానెల్ కూడా ఆ వీడియో తమది కాదని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తాజాగా దీనిపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.

ఈ ఫేక్ న్యూస్ వెనుక ఉన్నది హరీష్ రావు, రఘునందన్ లే అనే అనుమానం కలుగుతుంది, వారిద్దరూ దగ్గరి బంధువులు కావడంతో తమ పార్టీపై కుట్రపన్నారని మండిపడ్డారు. దుబ్బాక ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఓటర్లను ప్రలోభపెట్టే విధంగా తమ అభ్యర్థిపై ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.

చెరుకు శ్రీనివాస్ రెడ్డి అత్యంత నిజాయతీపరుడని, నిబద్దత గల వ్యక్తి అన్నారు. అతను గెలిస్తే నియోజకవర్గం అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరినట్టుగా జరుగుతున్న ప్రచారాన్ని ఎవ్వరూ నమ్మవద్దని నియోజకవర్గ ప్రజలకు ఉత్తమ్ పిలుపునిచ్చారు.

“దుబ్బాకలో బీజేపీ, టీఆర్ఎస్ లు కాంగ్రెస్ ను నేరుగా ఎదుర్కోలేక వెన్నుపోటు రాజకీయానికి తెర తీశాయి. కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి పై తప్పుడు ప్రచారాలకు తెగబడ్డాయి.తప్పుడు వార్తలను వ్యాప్తి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజలు అనవసర గందరగోళాలకు గురి కావద్దు..” అంటూ రేవంత్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేసారు.

Related News