logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

‘ఉప్పెన’ మూవీ రివ్యూ: మెగా హీరో రికార్డులు బద్దలుకొడతాడా? ఆడియెన్స్ ఏమంటున్నారు?

నటీనటులు: పంజా వైష్ణవ తేజ్, కృతి శెట్టి, విజయ్ సేతుపతి, రాజీవ్ కనకాల, సాయిచంద్ తదితరులు
కథ, దర్శకత్వం: బుచ్చిబాబు సానా
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
నిర్మాతలు: సుకుమార్, నవీన్ ఎర్నేని, రవి శంకర్
బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్

ఎట్టకేలకు మెగా అభిమానులు ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ‘ఉప్పెన’ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన ఉప్పెన సినిమాను తెరకెక్కించాడు. మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ ఈ సినిమాతోనే హీరోగా టాలీవుడ్ కి పరిచయం కావడం మరో విశేషం. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఈ సినిమాలో విలన్ గా కనిపించడంతో సినిమాకు మరింత హైప్ క్రియేట్ అయ్యింది. ఫస్ట్ లుక్ లోనే తన అందంతో కట్టిపడేసిన హీరోయిన్ కృతి శెట్టి, డిఎస్పీ అందించిన సంగీతం ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేసాయి. మరి ప్రేక్షకుల అంచనాలను రీచ్ అయ్యిందా? వైష్ణ తేజ్ మొదటి సినిమాతోనే హిట్టందుకున్నాడా? అనే విషయాలు రివ్యూలో తెలుసుకుందా..

కథ:
ఈ కథలో హీరోతక్కువ సామజిక వర్గానికి చెందిన వాడు. సముద్రంలో ఒక జాలరిగా ఆశీర్వాదం పాత్రలో వైష్ణవ్ తేజ్ కనిపిస్తాడు. చిన్నప్పటి నుంచి అతనికి సంగీత(కృతి శెట్టి) అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ ఆమె వెనకే తిరుగుతూ ఆమెను ప్రేమిస్తుంటాడు. సంగీత కూడా కాలేజీ చదివే రోజుల్లో హీరోతో ప్రేమలో పడుతుంది. అక్కడి నుంచి అన్ని ప్రేమ కథల్లోలాగానే ఎవ్వరికీ తెలియకుండా ఇద్దరూ కలుసుకుంటూ ప్రేమించుకుంటారు. సంగీత తండ్రి రాయణం(విజయ్ సేతుపతి) కులం, పరువు కోసం ప్రణాలిచ్చే మనిషి. అలాంటిది తనకూతురు తక్కువకులం వాడితో ప్రేమలో పడిందనే విషయం తెలిసి రగిలిపోతుంటాడు. వీరిద్దరి ప్రేమని విడదీయటానికి విలన్ తీసుకున్న నిర్ణయం ఈ సినిమాలో కీలకంగా మారుతుంది. ఇలాంటి నేపథ్యంలో హీరోహీరోయిన్లు తమ ప్రేమను బతికించుకున్నారా? చివరకు వీళ్ళ ప్రేమ గెలుస్తుందా? అనేది సినిమాలో మిగిలిన కథ.

విశ్లేషణ:
తెలుగు ప్రేక్షకులకు ఉప్పెన లాంటి ప్రేమ కథలు కొత్తేమీ కాదు. అయినా కొందరు దర్శకులు తమదైన స్టైల్ లో వీటిని డీల్ చేసి హిట్టు కొట్టేస్తుంటారు. ఇక ఉప్పెన సినిమా విషయానికొస్తే మొదటి సినిమానే అయినా వైష్ణవ తేజ్, కృతి శెట్టి తమ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టేసాడు. ఈ సినిమాలో విలన్ గా విజయ్ సేతుపతిని తప్ప మరొకరిని ఊహించుకోలేము. అంతా ఊహించినట్టే విజయ్ పెరఫార్మెన్స్ ఈ సినిమాకు ప్రధాన హైలెట్ గా నిలుస్తుంది. హీరో తండ్రిగా నటించిన సాయి చంద్ కూడా తన పాత్రలో మెప్పించారు . కథలో పాత్రలు ఒకెత్తయితే వాటిని ఎలివేట్ చేయడంలో మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ వంద శాతం న్యాయం చేసారు. ముఖ్యంగా విలన్ పాత్రకు ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా అందమైన విజువల్స్, డిఎస్పీ మ్యూజిక్ తో అలా సాగిపోతుంది. సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగ్ అయినట్టుగా అనిపిస్తుంది. అంతలోనే ప్రీ క్లైమాక్స్ తో దర్శకుడు ట్విస్ట్ ఇస్తాడు. ఈ సినిమాలో క్లైమాక్స్ ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటుంది. ఆ ఒక్క సీన్ తో సినిమా రిజల్ట్ మారిపోయినట్టుగా అనిపిస్తుంది. అప్పటివరకు ఆవెరేజ్ అనుకున్న సినిమాను క్లైమాక్స్ సీన్ తో నిలబెట్టాడు దర్శకుడు. అయితే ఈ క్లైమాక్స్ ను ఆడియెన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారనేది మాత్రం ఇపుడే చెప్పలేం. యూత్ కు బాగా కనెక్ట్ అయ్యే ఈ సినిమా, ఫ్యామిలీ ఆడియెన్స్ ను కూడా ఆకట్టుకోగలిగితే ఇంకా మంచి టాక్ ను సొంతం చేసుకుంటుంది. అయితే ఉప్పెన సినిమాను ఒకసారి హాయిగా చూసేయొచ్చు అంటున్నారు సినిమా చూసిన ప్రేక్షకులు.

ప్లస్ పాయింట్స్:
ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే.. ముందుగా చెప్పుకున్నట్టుగా లీడ్ రోల్స్ పెరఫార్మెన్స్, విజయ్ సేతుపతి విలనిజం, డిఎస్పీ మ్యూజిక్ క్లైమాక్స్ ప్లస్ పాయింట్స్ గా మారాయి.

మైన్స్ పాయింట్స్:
తెలిసిన కథే కావడం, సెకండ్ హాఫ్ స్లో గా ఉండటం మైనస్ పాయింట్స్ గా నిలుస్తాయి.

ఫైనల్ గా ఉప్పెన సినిమాకి 2. 75/5 రేటింగ్ ఇవ్వచ్చు.

Related News