ఎన్నో అవాంతరాలను దాటుకుని వైష్ణవతేజ్ నటించిన ‘ఉప్పెన’ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. అన్ని ఏరియాల నుంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా దర్శకుడు బుచ్చిబాబు రాసుకున్న కథకు, డైలాగ్స్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈసందర్భంగా పలు యూట్యూబ్ చానెళ్లకు దర్శకుడు ఇచ్చిన ఇంటర్యూలు వైరల్ గా మారుతున్నాయి.
ఉప్పెన సినిమా గురించి ఈ దర్శకుడు చెప్పిన వివరాలు కొత్త చర్చలకు తెర తీస్తున్నాయి. ఉప్పెన సినిమాకు వైష్ణవ్ తేజ్ కన్నా ముందుగా మరో హీరోను అనుకున్నాడట. ఆ హీరో ఎవరో కాదు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. కథ రాసుకునే సమయంలో విజయ్ ను అనుకున్నా కథ పూర్తిచేసే సమయానికి మనసు మార్చుకున్నాడట.
ఈ సినిమాకు వైష్ణవ్ తేజ్ అని విధాలుగా సరిపోతాడని భావించారట. అయితే విజయ్ ను వద్దనుకోవడానికి కారణాలు అడిగితే.. ఇప్పటికే విజయ్ స్టార్ డం పెరిగిపోయింది. నేను రాసుకున్న కథ ఇప్పుడు విజయ్ కు సెట్ అవ్వకపోవచ్చు అని అనిపించింది. అందుకే వైష్ణవ తేజ్ ను ఒకే చేసానని చెప్పుకొచ్చాడు.