logo

  BREAKING NEWS

కరోనా వ్యాప్తి: కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం!  |   హైదరాబాద్ పరిధిలో ఈ పది డివిజన్లే ‘కరోనా’ డేంజర్ జోన్లు!  |   బ్రేకింగ్: సచివాలయం కూల్చివేత పై ప్రభుత్వానికి హైకోర్టు షాక్!  |   బ్రేకింగ్: కంటైన్మెంట్ జోన్ గా తిరుమల  |   గాంధీ కుటంబానికి ఊహించని షాకిచ్చిన కేంద్రం..!  |   ప్రపంచాన్ని వణికిస్తున్న ‘బుబోనిక్ ప్లేగు’.. ఇది కరోనా కన్నా డేంజర్!  |   గాల్వన్ లోయ నుంచి చైనా వెనక్కి.. డ్రాగన్ ను నమ్మలేమంటున్న భారత్  |   చైనాతో యుద్ధం.. భారత్ కు మద్దతుగా నిలుస్తున్న దేశాలు ఇవే!  |   హైదరాబాద్ లో మళ్ళీ లాక్ డౌన్ లేనట్టే.. కారణం ఇదే!  |   బ్రేకింగ్‌: తెలంగాణ‌లో ఇవాళ భారీగా న‌మోదైన క‌రోనా కేసులు  |  

చెంచుల జీవన విధానం పై ఉపాసన వ్యాఖ్యలు

మెగా కోడలు ఉపాసన కామినేని ఇటీవల నల్లమల అడవుల్లో పర్యటించిన విషయం తెలిసిందే. శ్రీశైలం అడవుల్లో నివసించే చెంచు గ్రామాలను ఆమె సందర్శించారు. లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్న అక్కడివారికి అవసరమైన ఆహార పదార్తలను పంచి పెట్టారు. అలాగే శ్రీశైలం ఆలయ ఉద్యోగులకు, చెంచు కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంచారు.

ఆ సమయంలో అక్కడ కొన్ని పోటోలను తీసుకున్నారు. తాజాగా ఆ ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఓ రెండు మేక పిల్లలని ఎత్తుకుని దిగిన ఫోటోని పోస్ట్ చేస్తూ.. మరి కొన్ని రోజుల్లో ఈ బిజీ మేక పిల్లలు చెంచుల ఆహారంగా మారిపోతాయేమో అంటూ కాప్షన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఉపాసన చెంచుల జీవన విధానం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

ఇప్పుడిప్పుడు ప్రజల ఆహారపు అలవాట్లు, వారి జీవన విధానాలను, సంస్కృతిని అర్థం చేసుకోవడం నేర్చుకుంటున్నాను. ఇక్కడి ప్రజలు నిజంగా అద్భుతమైన వారు. ప్రకృతి పట్ల చెంచులకు ఉన్న ప్రేమ అనిర్వచనీయమన్నారు. అదే సమయంలో మన నమ్మకాలూ, అలవాట్లను ఇతరులపై రుద్దే సమయం కాదిది. మాంసం తినండి కానీ మితంగా తినండి. మనకు అవసరమైన వనరులను నైతికతతో వాడుకుందాం అంటూ ఆమె ఫేస్ బుక్ ద్వారా పోస్ట్ చేసారు.

Related News