logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

ఉపాసన మంచి మనసు.. ‘రాణి’ని దత్తత తీసుకున్న మెగా కోడలు

రామ్ చరణ్ సతీమణి, అపోలో లైఫ్ వైస్ చైర్‌పర్సన్ ఉపాసన కొణిదెల మరోసారి మంచి మనసు చాటు కున్నారు. ఆమె దత్తత తీసుకున్నారు. దత్త తీసుకోవడమంటే ఏ పిల్లో పిల్లాడో అనుకుంటే పొరపాటే. ఉపాసన మూగ జీవాలను అమితంగా ఇష్టపడతారు. వాటి సంక్షేమం కోసం అప్పుడప్పుడు సేవా కార్యక్రమాలు కూడా చేపడతారు.

జులై 20 ఉపాసన తన పుట్టిన రోజును జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె రాణి అనే ఏనుగును దత్తత తీసుకున్నారు. సోమవారం నగరంలోని నెహ్రు జూలాజికల్ పార్కును సందర్శించారు. ఈ పార్కులో ఉన్న వృద్ధ ఏనుగులలో రాణి కూడా ఒకటి. కాగా రాణిని సంవత్సర కాలం పాటు దత్తత తీసుకుంటున్నట్టుగా ఉపాసన ప్రకటించారు.

రాణి పోషణకు అయ్యేఖర్చు నిమిత్తము ఆమె రూ. 5 లక్షల చెక్కును క్యూరేటర్, ఐఎఫ్‌ఎస్‌ అధికారిని క్షితిజకు అందజేశారు. వన్య ప్రాణుల సంరక్షణలో భాగంగా ఉపాసన కృషిని క్షితిజ అభినందించారు. కరోనా కష్టకాలంలో నెహ్రు జూలాజికల్ పార్కులో మరిన్ని జంతువులను దత్తత తీసుకోవడానికి ముందుకు రావాలని ఆమె కోరారు.

Related News